తల్లిపాత్రలో కనిపించనున్న నిత్యామీనన్

0

imagesఎప్పుడూ చేసే రొటీన్ పాత్రలని మించి, మంచి మంచి పాత్రలు ఎప్పుడో కానీ రావు. ఆలాంటప్పుడు, విభిన్నమైన పాత్రలు పోషించాలి అనుకునే ఏ నటుడైన, నటైనా అస్సలు ఆ అవకాశాన్ని వదులుకోరు. అందుకే, స్పెషల్ రోల్స్ వచినప్పుడు కళ్ళు మూసుకుని ఓకే అనెస్తారు. తాజా సమాచారం ప్రకారం, అందాల నటి నిత్యామీనన్ కూడా లాంటి ఒక స్పెషల్ రోల్ కి ఓకే చెప్పిందట. అదీ అలాంటి ఇలాంటి పాత్ర కాదు..తల్లి పాత్ర.

ఇప్పటికే యువత లో మాంఛి క్రేజ్ సంపాదించుకున్న నిత్య చేతిలో ఎంతలేదన్నా నాలుగు సినిమాలు ఎప్పుడూ ఉంటాయి. కెరీర్‌లో ఇంత టాప్ పొజిషన్ లో ఉన్నప్పుడు, దాదాపు తన వయసున్న అమ్మాయికి తల్లిలా నటించడం అంటే మామూలు విషయం కాదు. అలాంటి ఛాలెంజిన్‌గ్ పాత్రని నిత్యా స్వీకరించింది. “ఓనమాలు” చిత్ర దర్శకుడు క్రాంతి మాధవ్ రూపొందిస్తున్న ఇంకా పేరు పెట్టని సినిమాలో నిత్యా మీనం స్వర్వానంద్ కి జోడీగా నటిస్తోంది. ఆ చిత్రంలోనే “ఐస్క్రీమ్” ఫేమ్ తేజస్వి కి తల్లి పాత్రలోనూ కనిపించనుంది అని ఫిల్మ్ నగర్ సమాచారం.

సినిమా స్క్రిప్టు వినగానే నిత్యామీనన్ చాలా ఆనందంగా, ఆసక్తిగా స్పందించిందని, ఇలాంటి ప్రయోగాత్మక పాత్రలు చేయడానికి తానెప్పుడూ సిద్ధమేనని చెప్పిందని చిత్రం యూనిట్ వర్గాలు తెలిపాయి. ఏదో మూసపాత్రలు చేసుకుంటూ గ్లామర్ ఒలికించడం కాకుండా.. విభిన్నమైన పాత్రలు చేయడం తనకు ఇష్టమని, ఇలాంటి అవకాశాలు ఎప్పుడో వస్తాయంటూ వెంటనే ప్రాజెక్టు ఆమోదించిందని అన్నారు.

ఈ సినిమాలో శర్వానంద్ హీరోగా చేస్తున్నాడు. వీళ్లిద్దరూ ఇంతకుముందు ఏమిటో ఈ మాయ సినిమాలో చేశారు. ఇప్పుడు రెండోసారి ఇద్దరూ జంటగా నటిస్తున్నారు. ఈ సినిమాలో శర్వా ఓ క్రీడాకారుడి పాత్ర పోషిస్తాడట.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ప్రశ్నిస్తా' సినిమా ప్రారంభం
జనం ఎంటర్టైన్మెంట్ పతాకంపై ప్రముఖనిర్మాత సత్య రెడ్డి నిర్మిస్తున్న 'ప్రశ్నిస్తా' మూవీ కి తన కుమారుడైన మనీష్ బాబు ని హీరోగా పరిచయం చేస్తూ రాజా వన్...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
powered by RelatedPosts