మరో ప్రత్యేక పాత్రలో కుర్ర హీరో

0

cool-ranbir-kapoor-in-white-shirt-pictureఎలాంటి పాత్రలోనైనా అవలీలగా ఒదిగిపోగల నేర్పు ప్రస్తుత బాలీవుడ్ హీరోల్లో,రణబీర్ కపూర్ కి కాసింత ఎక్కువే అని చెప్పాలి. ఇప్పటి వరకూ అతను చేసిన వైవిధ్యమైన సినిమాలని చూస్తే ఆ సంగతి ఇట్టే తెలిసిపోతుంది. మొన్నామధ్య వచ్చిన “బర్ఫీ” చిత్రంతో తన క్రేజ్ ని మరింతగా పెంచుకున్న రణబీర్, ప్రస్తుతం మరో ప్రత్యేక పాత్రలో ఒదిగిపోయేందుకు సన్నాహాలు చేసుకుంటున్నాడు. ప్రసిద్ధ నటుడు, గాయకుడు, దర్శక, నిర్మాత కిశోర్‌కుమార్‌గా వెండితెరపై మెరవనున్నాడు రణ్‌బీర్. ఒక రకంగా రణబీర్ కి అదొక పెద్ద సవాల్ అనే చెప్పుకోవాలి. అనురాగ్ బసు దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రం షూటింగ్‌కి వెళ్లడానికి ఇంకొంచెం సమయం పడుతుంది.

బసు ప్రస్తుతం కథ, స్క్రీన్‌ప్లే తయారీలో ఉన్నారు. ఇప్పటికే కిశోర్‌కుమార్ తనయుడు అమిత్‌కుమార్ దగ్గర అనుమతి తీసుకున్నారట. కథ గురించి అమిత్ దగ్గర చర్చలు జరిపారని సమాచారం. కిశోర్‌కుమార్‌కు సంబంధించిన పలు విశేషాలను అమిత్‌ని అడిగి తెలుసుకోవడంతో పాటు స్క్రీన్‌ప్లే తయారు చేయడానికి సహాయం చేయమని కోరారట. అందుకు అమిత్ సుముఖత వ్యక్తపరిచారని భోగట్టా. కిశోర్ కుమార్ లాంటి ఆణిముత్యాన్ని తెరమీద పలికించాలి అంటే ఎంతో నైపుణ్యం కావాలి. అత్యద్భుతంగా చేయకున్నా, కనీసం చెడగొట్టకుండా అయితే చూడగలడు అనే నమ్మకం రణబీర్ మీద అందరికీ ఉంది కనుక, ఎలాంటి భయాలు లేకుండా “కిషోర్ దా” ని చూడటానికి మనం కూడా ఆత్రంగా ఎదురుచూద్దామా..?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts