బ్రెట్ రాట్నర్ ఆధ్వర్యంలో తెరకెక్కే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్న తెలుగు హీరో శ్రీ రాజ్

0

భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రంలో హీరోగా నటించిన యంగ్ టాలెంటెడ్ యాక్టర్ శ్రీ రాజ్ అద్భుతమైన అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. హాలీవుడ్ స్క్రీన్ పై తన టాలెంట్ చూపించే బంపర్ ఆఫర్ సంపాదించగలిగాడు. స్టార్ డైరెక్టర్ మారుతి టీం వర్క్స్ భద్రమ్ బీ కేర్ ఫుల్ బ్రదరూ అనే చిత్రాన్ని నిర్మించిన సంగతి తెలిసిందే. ఆ సినిమాతో శ్రీ రాజ్ కు చాలా మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత తన నటన మరింత రాటు దేలేలా శిక్షణ పొందాడు. హాలీవుడ్ ప్రాజెక్ట్ కోసం ప్రిపేర్ అయ్యాడు. రష్ హవర్ లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ ని రూపొందించిన హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ బ్రెట్ రాట్నర్ ఆధ్వర్యంలో తెరకెక్కుతున్న చిత్రంలోనే శ్రీ రాజ్ నటించే అవకాశం సంపాదించాడు. న్యూయార్క్ నేపథ్యంలో ఈ చిత్ర కథ ఉంటుంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా ఈ సినిమా తెరకెక్కనుంది. దీంతో పాటు తెలుగులో పెద్ద చిత్రాలు నిర్మించే రెండు బ్యానర్స్ రూపొందించే చిత్రాల్లోనూ శ్రీరాజ్ హీరోగా నటించబోతున్నాడు.

ఈ సందర్భంగా హీరో శ్రీరాజ్ మాట్లాడుతూ…. నటన అంటే నాకు ప్రాణం. విభిన్నమైన పాత్రలు చేయాలనేది నా కోరిక. అందుకోసేమే ఇంజినీరింగ్ పూర్తి కాగానే… అమెరికాలోని న్యూయార్క్ ఫిల్మ్ అకాడెమీలో ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ కోర్స్ చేశాను. రష్ హవర్ లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ రూపొందించిన బ్రెట్ రాట్నర్ ఆధ్వర్యంలో సినిమా రూపొందిస్తుండండం చాలా హ్యాపీ. స్కైలైన్ న్యూయార్క్ పిఆర్ టీం ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కించే ఈ చిత్రంలో నేను టాక్సీ డ్రైవర్ గా లీడ్ క్యారెక్టర్లో నటిస్తున్నాను. రెండు జంటల మధ్య నడిపే ప్రేమ కథా చిత్రమిది. న్యూయార్క్ నేపథ్యంలో సాగే లవ్ స్టోరీ. ఇంగ్లిష్ తో పాటు హిందీలోనూ ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు. దీంతో పాటు… తెలుగులో భారీ చిత్రాలు నిర్మించే రెండు బ్యానర్స్ రూపొందించబోయే రెండు సినిమాల్లో హీరోగా నటించబోతున్నాను. వీటికి సంబంధించిన వివరాలు త్వరలోనే తెలియజేస్తాను. ఛాలెంజింగ్ ఉండే క్యారెక్టర్స్ చేయాలనేది నా గోల్. అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
powered by RelatedPosts