నటిని పెళ్ళాడనున్న యువ దర్శకుడు

0

Atlee Kumarఅదేంటో కానీ, మొన్నటి దాకా హీరోలు-హీరోయిన్లు ప్రేమలో పడటం – పెళ్లి చేసుకోవడం చాలా సాధారణంగా జరిగేది. ఇప్పుడు ట్రెండ్ మారిపొయినట్టుంది . ఎందుకంటే, ఇటీవల హీరోయిన్లు – నటీమణులు దర్శకులని పెళ్లి చేసుకోవడం అనే ట్రెండ్ బలపడుతోంది. మొన్నటికి మొన్న అందాల ముద్దుగుమ్మ అమలా పాల్ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలోకి మరో తమిళ జంట చేరింది. యువ దర్శకుడు అట్లి బుల్లితెర నటి ప్రియతో ఏడడుగులు వెయ్యడానికి సిద్ధమయ్యారు. వీరి వివాహ నిశ్చితార్థం ఆదివారం రాత్రి చెన్నైలో జరిగింది. రాజారాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన అట్లి స్టార్ దర్శకుడు శంకర్ శిష్యుడు. ఆర్య, నయనతార, జయ్, నజ్రియా నజీమ్ నటించిన “రాజారాణి “చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్న విషయం తెలిసిందే. కాగా బుల్లి తెర నటి ప్రియతో అట్లి ప్రేమలో పడ్డారు. ప్రియా కణాకానుంకాలంగళ్ అనే మెగా సీరియల్‌లో నటించారు. సింగం చిత్రంలో నటి అనుష్కకు చెల్లెలిగా నటించారు. అట్లి-ప్రియల ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహ నిశ్చితార్థం ఆదివారం నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్య, నటి నయనతార ప్రత్యేకంగా విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లి మాట్లాడుతూ ప్రియ తన జీవితంలోకి రాణిగా వస్తున్నారని సంతోషంగా అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రియ తనకు తెలుసని వివరించారు. పరిచయమైన తొలినాళ్లలో స్నేహితులుగానే మెలిగామని ఆ తరువాత ప్రేమికులయ్యామని తెలిపారు. తమ వివాహ నిశ్చితార్థానికి అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారని చెప్పారు. తమ వివాహం నవంబర్ లో జరుగుతుందని అట్లి వెల్లడించారు. వీరి స్ఫూర్తితో మరెందరు తారామణులు దర్శకులని పెళ్ళాడాతారో వేచి చూడాలి. పెళ్లి కానీ యువ తమిళ దర్శకులాందరూ ఎందుకైనా మంచిది, సిద్ధంగా ఉంటే సరి … ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts