నటిని పెళ్ళాడనున్న యువ దర్శకుడు

0

atlee-priya-engagement-stills-photos-pictures-575x330అదేంటో కానీ, మొన్నటి దాకా హీరోలు-హీరోయిన్లు ప్రేమలో పడటం – పెళ్లి చేసుకోవడం చాలా సాధారణంగా జరిగేది. ఇప్పుడు ట్రెండ్ మారిపొయినట్టుంది . ఎందుకంటే, ఇటీవల హీరోయిన్లు – నటీమణులు దర్శకులని పెళ్లి చేసుకోవడం అనే ట్రెండ్ బలపడుతోంది. మొన్నటికి మొన్న అందాల ముద్దుగుమ్మ అమలా పాల్ దర్శకుడు ఎ.ఎల్ విజయ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే కోవలోకి మరో తమిళ జంట చేరింది. యువ దర్శకుడు అట్లి బుల్లితెర నటి ప్రియతో ఏడడుగులు వెయ్యడానికి సిద్ధమయ్యారు. వీరి వివాహ నిశ్చితార్థం ఆదివారం రాత్రి చెన్నైలో జరిగింది. రాజారాణి చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయం అయిన అట్లి స్టార్ దర్శకుడు శంకర్ శిష్యుడు. ఆర్య, నయనతార, జయ్, నజ్రియా నజీమ్ నటించిన “రాజారాణి “చిత్రం మంచి విజయాన్ని సాధించిందన్న విషయం తెలిసిందే. కాగా బుల్లి తెర నటి ప్రియతో అట్లి ప్రేమలో పడ్డారు. ప్రియా కణాకానుంకాలంగళ్ అనే మెగా సీరియల్‌లో నటించారు. సింగం చిత్రంలో నటి అనుష్కకు చెల్లెలిగా నటించారు.

అట్లి-ప్రియల ప్రేమకు ఇరు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వీరి వివాహ నిశ్చితార్థం ఆదివారం నగరంలోని ఒక నక్షత్ర హోటల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి నటుడు ఆర్య, నటి నయనతార ప్రత్యేకంగా విచ్చేసి శుభాకాంక్షలు అందించారు. ఈ సందర్భంగా దర్శకుడు అట్లి మాట్లాడుతూ ప్రియ తన జీవితంలోకి రాణిగా వస్తున్నారని సంతోషంగా అన్నారు. ఎనిమిది సంవత్సరాలుగా ప్రియ తనకు తెలుసని వివరించారు.

పరిచయమైన తొలినాళ్లలో స్నేహితులుగానే మెలిగామని ఆ తరువాత ప్రేమికులయ్యామని తెలిపారు. తమ వివాహ నిశ్చితార్థానికి అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు మాత్రమే హాజరయ్యారని చెప్పారు. తమ వివాహం నవంబర్ లో జరుగుతుందని అట్లి వెల్లడించారు.

వీరి స్ఫూర్తితో మరెందరు తారామణులు దర్శకులని పెళ్ళాడాతారో వేచి చూడాలి. పెళ్లి కానీ యువ తమిళ దర్శకులాందరూ ఎందుకైనా మంచిది, సిద్ధంగా ఉంటే సరి … ఏమంటారు?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స్టార్ హీరోని టార్గెట్ చేసిన తేజ‌!
`నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌క్సెస్ తో తేజ మ‌ళ్లీ బ్యాక్ బౌన్స్ అయ్యాడు. డైరెక్ట‌ర్ గా ప‌ట్టాలు త‌ప్పి పోయినా బండిని ఒక్క హిట్ తో మ‌ళ్లీ ట్...
శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చె...
ధైర్యం` హీరోయిన్ సీక్రెట్ మ్యారేజ్
అలనాటి నటి మున్‌మున్‌ సేన్‌ కుమార్తె, బాలీవుడ్‌ నటి రియా సేన్‌ రహస్యంగా వివాహం చేసుకుని షాక్ ఇచ్చింది.  కొంతకాలంగా రియా.. ఫొటోగ్రాఫర్‌ శివమ్‌ త...
powered by RelatedPosts