ఏమీ లేనప్పుడు ఎందుకది కొన్నట్టు?

0

aditya-shraddha-pardaphash-102923సినీ రంగంలో ఏ ఇద్దరి మధ్య అయినా ఎఫైర్ నడుస్తోంది అని కాస్తంత ఉప్పు అండినా, విషయం తేలేదాకా మీడియా ఇక ఆ జంట వెనకాలే పడుతుంది. అది చాలా సహజం. అయితే, గట్టిగా నిలదీసినాప్పుడు ప్రతీ జంట “మా మధ్య అలాంటిదేమీ లేదు…కేవలం స్నేహం మాత్రమే ఉంది” అనడం కూడా సహజమే. గత కొన్ని నెలలుగా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని తెగ బుకాయించిన జంటలో మొదటి మనిషి ఆదిత్యారాయ్ కపూర్. ముద్దుగుమ్మ శ్రద్ధా కపూర్ తో గురుడు డేటింగ్ చేస్తున్నట్టు ఎప్పటినుంచో గుసగుసలు వినిపిస్తున్నాయి.

అయితే, అందరిలాగే ఇద్దరి మధ్య ఏమీ లేదు లేదంటూనే శ్రద్ధాకపూర్ కోసం వజ్రాల ఉంగరం కొనేశాడు ఆదిత్యారాయ్ కపూర్. తన చిత్రం ప్రమోషన్‌లో ఎంతో బిజీగా ఉన్నా.. షాట్ గ్యాప్‌లో షాపింగ్‌కు ట్రైచేశాడీ కుర్ర హీరో. ‘దావత్ ఎ ఇష్క్’ చిత్రం ప్రచార కార్యక్రమం కోసం సహనటి పరిణీతి చోప్రాతో సూరత్ వెళ్లే క్రమంలో ఆదిత్యా… ఓ జ్యువెలరీ షాప్‌ను విజిట్ చేశాడట. అక్కడ రద్దీ ఉండటంతో తిరిగి వచ్చేశాడట. తరువాత నగల వ్యాపారిని తన హోటల్‌కు రప్పించుకొని డైమండ్ రింగ్ కొనేశాడనేది ‘ది మిర్రర్’ కథనం.

ఇప్పుడేం అంటావ్ బాబూ… ఉన్నట్టా … లేనట్టా?

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

తార‌క్ స‌ర‌స‌న పూజా హెగ్దే
యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్- త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న సినిమా త్వ‌ర‌లో సెట్స్ కు వెళ్ల‌నున్న సంగ‌తి తెలిసిందే. తాజాగా ఇందులో హీరోయిన్ ...
రాజ‌మండ్రిలో స‌మంత రైడింగ్
సమంత స్కూటీపై షికార్లు చేసేస్తోంది. ఎంజాయ్‌ చేయడం కోసం కాదు లేండి. ఆమె నటిస్తున్న చిత్రంలోని ఓ సన్నివేశం కోసం. సమంత కథానాయికగా ‘యూ టర్న్‌’ తె...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
powered by RelatedPosts