నల్లనయ్య నటనకి నేటితో పదేళ్ళు

0

vishalబక్కపలచని దేహం…కారు నలుపు రంగు వర్ణం….ఆరడుగుల శరీరం….మాతృభాష తెలుగు కానీ తమిళంలో పెద్ద హీరో…!! ఇవి చాలేమో హీరో విశాల్ కృష్ణా రెడ్డి అలియాస్ విశాల్ గురించి చెప్పుకోవడానికి…అవునా? మరే, హీరో కావడానికి ఏ మాత్రం అర్హత లేనట్టు కనిపించే అద్భుతమైన నటుడు విశాల్ సినీ పరిశ్రమకి వచ్చి నేటితో పదేళ్ళు పూర్తయ్యాయి. విశాల్ నటించిన ‘చెల్లామే’ 2004 సెప్టెంబరు 10న విడుదలైంది. ఈరోజుకు పది సంవత్సరాలు పూర్తి అయింది.

ఈ సందర్భంగా విశాల్ ఇప్పటి వరకు తన సినీరంగ ప్రయాణం చాలా గొప్పగా సాగిందన్నాడు. ఇప్పటి వరకు సినిమా రంగంలో తనకు సహకరించిన వారందరికీ, అభిమానులకు విశాల్ కృతజ్ఞతలు తెలిపాడు. విభిన్న కథాంశాలతో, నటనకు ప్రాధాన్యత గల పలు చిత్రాలలో విశాల్ నటించాడు. ప్రముఖ నిర్మాత, వ్యాపారావేత్త అయిన జికె రెడ్డి కుమారుడైన విశాల్ చెన్నైలోనే పుట్టిపెరిగాడు. పందెంకోడి, పల్నాడు, ఇంద్రుడు, వాడువీడు, సెల్యూట్, ధీరుడు..వంటి చిత్రాలలో నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.
ప్రారంభం నుంచి విశాల్ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్నాడు.తెలుగులోకి అనువాదమైన విశాల్ చిత్రాలు ప్రేక్షకాదరణ పొందాయి. మంచి పేరు తెచ్చిపెట్టాయి. ఇటీవల విశాల్ ఫిల్మి ఫ్యాక్టరీ అనే సంస్థను స్థాపించి నిర్మాతగా కూడా మారాడు. పాండియనాడు, నాన్ సింగప్పు మణితన్ చిత్రాలు నిర్మించాడు. పూజై చిత్రం నిర్మిస్తున్నారు. ప్రస్తుతం విశాల్ పూజై చిత్రం షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఇప్పటి వరకు డబ్బింగ్ చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ తమిళ హీరో విశాల్ త్వరలో తెలుగులో డైరెక్ట్ చిత్రంలో నటించబోతున్నారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ఛ‌ల్ మోహ‌న్ రంగ` పాట‌లొచ్చేసాయ్!
ఉగాది అంటే ఇంట్లో పిండి వంటలు, బంధుమిత్రుల హడావిడి, థియేటర్లలో కొత్త సినిమాలే కాదు, యూట్యూబ్లో ఎన్నో సినిమాల పాటలు, టీజర్లు రిలీజ్ అవుతాయి. ఈ ఉగా...
నాగశౌర్య హీరోగా ఐరా క్రియేషన్స్ నిర్మాణంలో `నర్తనశాల` చిత్రం ప్రారంభం
`ఛలో` చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఐరా క్రియేషన్స్ నాగశౌర్య హీరోగా నటించే రెండో చిత్రం @నర్తనశాల ప్రారంభమైంది. ఉగాది పర్వదినాన సినీ అతిరథు...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts