`ర‌ఘువ‌రన్ బి.టెక్` లానే `విఐపి-2` ఎంజాయ్ చేస్తారు: హీరో ధ‌నుష్!

0

ధ‌నుష్ హీరోగా వి క్రియేష‌న్స్‌, వండ‌ర్ బార్స్ ప‌తాకాల‌పై తెర‌కెక్కుతోన్న‌ చిత్రం `విఐపి2`. సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ ద‌ర్శ‌కురాలు. క‌లైపులి థాను, ధ‌నుష్ నిర్మాత‌లు. ఈ సినిమా ప్ర‌మోష‌న్ లో భాగంగా చిత్ర యూనిట్ శ‌నివారం హైద‌రాబాద్‌లో సంద‌డి చేసింది. ఈ సంద‌ర్భంగా

సౌంద‌ర్య ర‌జ‌నీకాంత్ మాట్లాడుతూ `విఐపి2` నాకు స్పెష‌ల్ మూవీ. ధ‌నుష్ తెలుగులో చేసిన తొలి స్ట్ర‌యిట్ మూవీ. ధ‌నుష్ నాపై న‌మ్మ‌కంతో నాకు అవ‌కాశం ఇచ్చి స‌పోర్ట్ చేసినందుకు ఆయ‌న‌కు థాంక్స్‌“ అన్నారు.

హీరో ధ‌నుష్ మాట్లాడుతూ “తెలుగులో నేను చేసిన‌ తొలి స్ట్ర‌యిట్ సినిమా `విఐపి2`.తెలుగులో స‌క్సెస్ అయిన విఐపి చిత్రాన్ని తెలుగులో ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ పేరుతో విడుద‌ల చేశాం. ఆ సినిమాకు సీక్వెల్‌గానే ఈ సినిమా రూపొందింది. తెలుగులో చేయ‌డం వ‌ల్ల భాష గురించి కూడా తెలుసుకుంటున్నాను. బ్యూటీఫుల్ జర్నీ. ర‌ఘువ‌ర‌న్ బి.టెక్ సినిమాను ప్రేక్ష‌కులు ఎలా ఎంజాయ్ చేశారో ఈ సినిమాను కూడా అలాగే ఎంజాయ్ చేస్తారు. నిర్మాత‌లు థాను, ప‌రంధామ‌న్‌గారికి థాంక్స్‌“ అన్నారు.

కాజోల్ మాట్లాడుతూ “నాకు ఇష్ట‌మైన సిటీస్‌లో హైద‌రాబాద్ ఒక‌టి. గ‌తంలో నేను హైద‌రాబాద్‌కు చాలా సార్లు వ‌చ్చాను. నేను హిందీ కాకుండా వేరే భాష‌లో న‌టించి చాలా కాల‌మైంది. కానీ సౌంద‌ర్య‌, ధ‌నుష్ కార‌ణంగానే విఐపి2లో న‌టించాను. ధ‌నుష్ చాలా కేర్ తీసుకున్నాడు“ అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts