విజయేంద్ర ప్ర‌సాద్ పారితోషికం @2కోట్లు!

0

కథా రచయితగా విజయేంద్ర ప్రసాద్ ది సుధీర్ఘ ప్ర‌స్థానం. ఎన్నో సూప‌ర్ హిట్ సినిమాల‌కు ఆయ‌న క‌థ‌లు అందించారు. ముఖ్యంగా త‌న‌యుడు రాజ‌మౌళి అద్భుత‌మైన క‌థ‌లు అందించి…కొడుకు ఎదుగ‌ద‌లకు ఎంతో దోహ‌ద‌ప‌డ్డారు. ఇక బాహుబలి సినిమా తర్వాత విజయేంద్ర ప్రసాద్ రేంజ్ ఆకాశానికంటుతోంది. అటు బాలీవుడ్, త‌మిళ సినిమాల‌కు క‌థ‌లు అందిస్తున్నారు. దీంతో స్వ‌యంగా హీరోలే ఆయ‌న్ను క‌థ‌లు సిద్దం చేయ‌మని చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో ఓ హీరో వ‌ల్ల ఆయ‌న క‌థ బ‌డ్జెట్ కూడా పెరిగిన‌ట్లు తెలుస్తోంది.

ఇది మంచు విష్ణు సినిమాకు సంబంధించినది కావడం విశేషం. మోహన్ బాబు తనయుడి కోసం ఒక కథను తయారు చేశారట విజయేంద్రప్రసాద్. దానికి మంచు ఫ్యామిలీ ఫిదా అయిపోయిందట. విష్ణు హీరోగా ఆ కథతో సినిమాను రూపొందించనున్నారని తెలుస్తోంది. ఈ కథకు గానూ విజయేంద్రప్రసాద్ కు ఏకంగా రెండు కోట్ల రూపాయల రెమ్యనరేషన్ ఇచ్చి.. విజయేంద్ర ప్రసాద్ కథను కొనుగోలు చేశారనే టాక్ వినిపిస్తోంది. అధికారిక ధ్రువీకరణ ఏమీ లేకపోయినా.. ఆసక్తిదాయకంగానే ఉంది ఈ రూమర్.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

అర్జున్ రెడ్డి డైరెక్ట‌ర్ తో మ‌హేష్‌...!
సూపర్‌స్టార్ మహేశ్‌బాబు కారు మెకానిక్‌ అవతారం ఎత్తబోతున్నారా? అవుననే అంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. ‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో వెలుగులోకి వచ్చిన దర...
భోజ్ పురి `బాహుబ‌లి` తొలి రూపు
రాజ‌మౌళి ట్యాలెంట్ ను ప్ర‌పంచానికి ప‌రిచ‌యం చేసిన అద్భుత దృశ్య‌రూపం `బాహుబ‌లి` భోజ్ పురిలో రీమేక్ చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భోజ్‌పూరి నట...
న‌య‌న్-శివ‌న్ పెళ్లి షురూ అయిందా?
న‌య‌న‌తార-డైరెక్ట‌ర్ విఘ్నేష్ శివ‌న్ డీప్ ల‌వ్ లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఇద్ద‌రూ పెళ్లి చేసుకుంటార‌ని చాలా రోజుల నుంచి వార్త‌లు కూడా వ‌స్తున్నాయి...
powered by RelatedPosts