సెట్స్ కెళ్లిన క‌త్తిలాంటి కాంబినేష‌న్

0
త‌మిళ హీరో విజ‌య్- ముర‌గ‌దాస్ కాంబినేష‌న్ లో తెర‌కెక్క‌నున్న కొత్త చిత్రం ప్రారంభ‌మైంది. ముహూర్త‌పు స‌న్నివేశానికి విజయ్ క్లాప్ ఇచ్చారు.  ఇందులో విజ‌య్ స‌ర‌స‌న కీర్తి సురేష్ న‌టిస్తోంది. గ‌తంలో వీరిద్ద‌రూ క‌లిసి `భైర‌వ` సినిమాలో న‌టించారు. ఇప్పుడు రెండ‌వ‌సారి జోడీ క‌డుతున్నారు.  ఈ చిత్రాన్ని  స‌న్ పిక్చ‌ర్స్ నిర్మిస్తోం ది. గ‌తంలో విజ‌య్- ముర‌గ‌దాస్ క‌ల‌యిక‌లో తెర‌కెక్కిన `తుపాకీ`, `క‌త్తి` సినిమాలు బ్లాక్ బ‌స్ట‌ర్. దీంతో సినిమాపై కూడా ముంద‌స్తు భారీ అంచ‌నాలు ఏర్ప‌డుతున్నాయి. విజ‌య్ అభిమానులు హ్యాట్రిక్ అవ్వ‌డం షురూ అంటూ ఆనందంతో ఉబ్బిత‌బ్బిబుతున్నారు.
కాగా ముర‌గ‌దాస్  అంద‌రికీ దీపావ‌ళి శుభాకాంక్ష‌లు చెప్పేసారు. సంక్రాంతి త‌రుణంలో దీపావ‌ళి ఏంటి అని ఆశ్చ‌ర్య‌పోతున్నారు. దానికి కార‌ణం లేక‌పోలేదు. తుపాకీ, క‌త్తి సినిమాలు దీపావ‌ళికి విడుద‌లై భారీ విజ‌యాన్ని అందుకున్నాయి. అలాగే ఈ సినిమా కూడా దీపావ‌ళికి రిలీజ్ చేస్తున్న‌ట్లు హింట్ ఇచ్చారంతే. కాగా ఇది విజ‌య్ కి 62వ సినిమా కావ‌డం విశేషం.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

రామ్ తో ప్రవీణ్ స‌త్తారు మూవీ
గ‌రుడ‌వేగ` హిట్ తో ప్ర‌వీణ్ స‌త్తారు పేరు టాలీవుడ్ అంత‌టా మారు మ్రోగిపోయింది. జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా సైతం ఇవ్వ‌ని పేరు ప్ర‌ఖ్యాత‌ల్ని...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
సూపర్‌స్టార్‌ మహేష్‌, ఎ.ఆర్‌.మురుగదాస్‌ 'స్పైడర్‌' తమిళ రైట్స్‌ 'లైకా' సొంతం
సూపర్‌స్టార్‌ మహేష్‌ హీరోగా ఠాగూర్‌ మధు సమర్పణలో ఎన్‌.వి.ఆర్‌. సినిమా ఎల్‌ఎల్‌పి, రిలయన్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకాలపై ఎ.ఆర్‌.మురుగదాస్‌ దర్శకత్వ...
powered by RelatedPosts