తెలుగులో కాజల్‌ ‘జిల్లా’

0

Kajal Agarwal New Photos (1)విజయ్‌, కాజల్‌ అగర్వాల్‌ జంటగా నటించగా తమిళంలో సూపర్‌ హిట్టయిన ‘జిల్లా’ చిత్రం తెలుగులో రాబోతోంది. తీవ్ర పోటీ మధ్య ఈ సినిమా తెలుగు హక్కులను శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్‌ సంస్థ దక్కించుకుంది. సూపర్‌గుడ్‌ ఫిలిమ్స్‌ అధినేత ఆర్‌.బి. చౌదరి సమర్పణలో తమటం, కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ సన్నిధి సంయుక్తంగా ఈ చిత్రాన్ని అందించబోతున్నారు. నామన శంకర్‌రావు సహ నిర్మాత. మలయాళ సూపర్‌స్టార్‌ మోహన్‌లాల్‌, ప్రదీప్‌ రావత్‌, సంపత్‌రాజ్‌ కీలక పాత్రధారులైన ఈ చిత్రానికి ఆర్‌.టి. నేసన్‌ దర్శకుడు. ఈ సినిమా గురించి నిర్మాతలు కుమార్‌రెడ్డి, ప్రసాద్‌ మాట్లాడుతూ ‘‘ఈ చిత్రాన్ని తెలుగులో అనువదించే అవకాశం లభించడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాం. తెలుగు వెర్షన్‌ కోసం తెలుగు అగ్ర హాస్యనటుడు బ్రహ్మానందం, ఎల్బీ శ్రీరామ్‌, సురేఖావాణి తదితరులపై ప్రత్యేకంగా కొన్ని సన్నివేశాలను చిత్రీకరించారు. ఆర్‌.బి. చౌదరి తనయుడు జీవా ఇందులో ప్రత్యేక అతిథి పాత్ర పోషించడం విశేషం. తమిళనాట కాసుల వర్షం కురిపించి, విజయ్‌ కెరీర్‌లో బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్నీ అమితంగా అలరిస్తుందనే నమ్మకం ఉంది. త్వరలో తెలుగు వెర్షన్‌ టైటిల్‌ను ప్రకటిస్తాం’’ అని చెప్పారు. మహత్‌ రాఘవేంద్ర, నివేదా థామస్‌, సూరి, పూర్ణిమా భాగ్యరాజ్‌ తారాగణమైన ఈ చిత్రానికి మాటలు: శశాంక్‌ వెన్నెలకంటి, పాటలు: వెన్నెలకంటి, సంగీతం: డి. ఇమాన్‌, ఛాయాగ్రహణం: గణేశ్‌ రాజవేలు, కూర్పు: డాన్‌ మ్యాక్స్‌, కథ, స్ర్కీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్‌.టి. నేసన్‌.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts