"అందాల రాక్షసి" ఫ్లాప్ హీరోతో చేస్తోందా?

0

Vaibhav-lavanyaఅలనాటి అగ్ర దర్శకుడు కోదండారామి రెడ్డి తనయుడు “వైభవ్” మళ్లీ చాలాకాలం తరువాత ఒక సినిమా చేస్తున్నాడు. “అందాల రాక్షసి” చిత్రం ద్వారా పరిచయమై, తెలుగు ప్రేక్షకులని అలరించిన లావణ్య త్రిపాఠీ ఇంకా పేరు పెట్టని ఈ చిత్రంలో వైభవ్ సరసన కథానాయికగా కనిపించనుంది. ప్రస్తుతం టాలీవుడ్ ని ఏలుతున్న అగ్ర దర్శకుడు రాజమౌళి దగ్గర ‘మగధీర’, ‘మర్యాద రామన్న’, ‘ఈగ’ చిత్రాలకు అసోసియేట్‌గా పనిచేసిన జగదీశ్ తలశిల ఈ చిత్రం ద్వారా దర్శకునిగా పరిచయమవుతున్నారు.

మయూఖ క్రియే షన్స్ పతాకంపై సాయిప్రసాద్ కామినేని నిర్మిస్తున్న ఈ చిత్రం పూజా కార్యక్రమాలు శుక్రవారం హైదరాబాద్‌లో జరిగాయి. ముహూర్తపు దృశ్యానికి కీరవాణి కెమెరా స్విచాన్ చేయగా, రాజమౌళి క్లాప్ ఇచ్చారు. సీనియర్ దర్శకులు ఎ. కోదండరామిరెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. ఈ నెల 20 నుంచి చిత్రీకరణ మొదలుపెడతామని నిర్మాత తెలిపారు. ఈ చిత్రానికి మాటలు: జలదంకి సుధాకర్, కెమెరా: ఈశ్వర్ యొల్లు మహంతి, సంగీతం: కీరవాణి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts