రామ్ గోపాల్ వర్మ త్వరలో పెళ్లి పిలుపు

0

RamGopalVarmaనిఖిత శ్రీ సమర్పణలో డి.వి. సినీ క్రియేషన్స్ పతాకంపై డి. వెంకటేష్ విలక్షణ – వివాద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో కలిసి ఈ సంవత్సరంలో మూడు సినిమాలు నిర్మించబోతున్నారు. అందులో మొదట నిర్మించిన చిత్రం రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో “365 days”. ఈ సినిమా రిలీజ్ కాగానే వెంటనే రామ్ గోపాల్ వర్మతో మరో సినిమా కూడా మే నుంచే ప్రారంభి౦చబోతున్నారు. ఈ రెండు కాకుండా మరో ఫీల్ గుడ్ లవ్ స్టొరీ స్క్రిప్ట్ పై కూడా ముమ్మరంగా పనులు జరుగుతున్నాయి . ఈ సందర్భంగా నిర్మాత డి. వెంకటేష్ మాట్లాడుతూ “రామ్ గోపాల్ వర్మ గారి మొత్తం కెరీర్లో ఎక్కువగా వయోలెంట్ సినిమాలు, హర్రర్ సినిమాలు, యాక్షన్ ధ్రిల్లర్లు తీశారు. అడపాదడపా రంగిలా, మస్త్ లాంటి లవ్ స్టోరీలు తీసినా వాటిల్లో ఒక వయోలెంట్ బ్యాక్ డ్రాప్ లేదా ఫిల్మ్ ఇండస్ట్రీ లాంటి ఒక ఫాంటసీ బ్యాక్ డ్రాప్ వుండేది. కానీ 365 days లో నాకు విపరీతంగా నచ్చిన అంశం ఏంటంటే వర్మ గారు తన 25 ఏళ్ల కెరీర్లో 100% పూర్తి లవ్ & రొమాంటిక్ చిత్రం మొట్టమొదటి సారి తీయటం. వర్మ సినీ జీవితం లో ఫస్ట్ టైమ్ ప్యూర్ లవ్ అండ్ మ్యూజికల్రొ మాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందిన “365 days” పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకొని ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రం చూసినవాళ్లు “365 days” మూవీ ప్రతి ప్రేమజంటకి, ప్రతి పెళ్ళైన జంటకి కూడా కనెక్ట్ అవుతుందని చెప్తున్నారు. “365 days” ఒక్క రామ్ గోపాల్ వర్మ పెళ్లి కథే కాదు, ప్రతి ఒక్కరి ప్రేమ కథ మరియు ప్రతి ఒక్కరి పెళ్లి కథ. ఈ అందమైన పెళ్లి కథకు ప్రేక్షకులందరూ కదలి రావాలని రామ్ గోపాల్ వర్మ త్వరలో పెళ్లి పిలుపు ఇవ్వబోతున్నారు. ఈ చిత్రం తాలూకు ఒక ట్రైలర్ ని, ఒక పాటని ఈ నెల 21 న రిలీజ్ చేయబోతున్నామని’ అన్నాడు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts