నాగచైతన్య, కృతిసనన్ దోచెయ్ వెరైటీ ప్రమోషన్

0

Naga-Chaitanya-Dochey-movie-stills-1ఏ సినిమాకైనా ప్రమోషన్ జోరందుకునేది ఆడియో రిలీజ్ వేడుకతోనే. ఓ సినిమా ఆడియో విడుదలవుతోందంటే.. ఇక అతి త్వరలో సినిమా విడుదల కాబోతోందని ఫిక్స్ అవుతారు సినీజనాలు. ఇలాంటి ఆడియో రిలీజ్ వేడుకలను సాధ్యమైనంత గ్రాండ్ గా… వీలయినంత వెరైటీగా నిర్వహించి తద్వారా తమ సినిమాకు క్రేజ్ క్రియేట్ అయ్యేలా ప్లాన్ చేస్తుంటారు. రీసెంట్ గా రుద్రమదేవి చిత్రం ఆడియోను… మూడు పాటలు విశాఖలోనూ.. మరో మూడు పాటలు వరంగల్ లోనూ విడుదల చేసి.. రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు గుణశేఖర్. హీరో నాగచైతన్య తాజా చిత్రం విషయంలోనూ… ఇలాగే ప్లాన్ చేశారు. అయితే ఇంకాస్త వెరైటీగా… ఒక్కో పాటను ఒక్కో రోజు విడుదల చేస్తున్నారు.
నాగచైతన్య, కృతిసనన్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం దోచెయ్. స్వామిరారా ఫేం సుధీర్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా.. షూటింగ్ కార్యక్రమాలు ముగించుకుని విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో ఈ సినిమా ప్రమోషన్ ను వెరైటీ ప్లాన్ చేసిన నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్… ఇందులో భాగంగా ఒక్కో పాటను ఒక్కో రోజు విడుదల చేస్తున్నారు. మార్చి-28 నుంచి సాంగ్స్ రిలీజ్ చేయడం మొదలెట్టారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రెండు పాటలు విడుదల అయ్యాయి. ఏప్రిల్-2న మేకింగ్ వీడియోను… మూడవ తేదీన ఆడియో ఆల్బమ్ ను విడుదల చేయనున్నారట. ఇక వేసవి కానుకగా ఏప్రిల్-17న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తోంది. మరి… దోచెయ్ సినిమాకు ఈ వెరైటీ ప్రమోషన్ ఎంతవరకూ హెల్ప్ అవుతుందో చూడాలి.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
అదరగొడుతున్న మాస్ మహారాజా రవితేజ "నేల టిక్కెట్టు" ట్రైలర్‌:
మాస్ మహారాజా రవితేజ సినిమా అంటేనే ఒక ఫుల్ మీల్స్ భోజనం. ఆయన సినిమాల్లో కామెడి ఉంటుంది, యాక్షన్ ఉంటుంది, వెటకారపు డైలాగులు ఉంటాయి, మంచి ఎమోషన్...
'ఫ్రీ స్పోర్ట్స్ రిహాబ్ సెంటర్' కి మహేష్ బాబు చేయూత
6 సంవత్సరాలుగా స్లమ్ ప్రాంతాలలో రోజుకి 150 కి పైగా రోగులకు వైద్య శిబిరాలు నిర్వహిస్తున్న ఎన్.జీ.ఓ కి మహేష్ బాబు తన సహాయ సహకారాలు అందిస్తున్నా...
powered by RelatedPosts