స్టార్స్ బ్లస్సింగ్స్ తో `వైశాఖం`.. హిట్ షురూ!

0
డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌. బి ద‌ర్శ‌క‌త్వం లో తెర‌కెక్కిన `వైశాఖం` సినిమాకు కౌంట్ డౌన్ స్టార్ట్ అయిపోయింది. మ‌రో నాలుగు రోజుల్లో `వైశాఖం` ప్ర‌పంచ వ్యాప్తంగా తెలుగు ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి ముందుకు వ‌చ్చేస్తుంది. ఇప్ప‌టికే ఆడియో బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందుకుంది. వ‌సంత్ అందించిన క్లాస్ మాస్ పాట‌లు శ్రోత‌ల్ని విశేషంగా ఆక‌ట్టుకున్నాయి. ప్ర‌తి పాట‌లోనూ ఎన‌ర్జీ ఉంది. ఆ ఎన‌ర్జీని ఎలివేట్ చేస్తూ…హీరో, హీరోయిన్లు హ‌రీష్‌..అవంతిక అద్భుత‌మైన పెర్పామెన్స్ ఇచ్చారు. మాట‌ల్లో కొత్త వాళ్లం అనుకుంటున్నాం గానీ.. పెర్పామెన్స్ చూస్తే ఆ ఫీలింగ్ ఎక్క‌డా క‌ల్గ‌లేదు. ఇక జ‌య.బి టేకింగ్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌రోసారి ష్యూర్ షాట్ ప‌క్కా తెలుస్తోంది. ట్రైల‌ర్..టీజ‌ర్ లో ఆ కాన్ఫిడెన్స్ క‌నిపిస్తుంది. అందుకేనేమో  టాలీవుడ్ టాప్ సెల‌బ్రిటీలు సైతం `వైశాఖం` ను ఆకాశానికి ఎత్తేసారు.
సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఆడియోకు ముఖ్య అతిధిగా విచ్చేసి `వైశాఖం` వీడియో పాట‌ల‌ను చూసి సంగీత ద‌ర్శ‌కుడు వ‌సంత్ మంచి ఆల్బ‌మ్ ఇచ్చాడ‌ని ప్ర‌శంసించారు. ఇక సినిమా విజ‌యం సాధించాల‌ని టీమ్ ను బ్ల‌స్ చేశారు. ఇక యంగ్ హీరో నాగచైత‌న్య సైతం పాట‌ల్లో రిథ‌మ్ ఉందంటూ మొచ్చుకున్నారు.  సినిమా స‌క్సెస్ అయి కొత్త వాళ్ల‌కు  బూస్టింగ్  ఇవ్వాల‌ని కోరుకున్నారు.  ఇక వ‌రుస స‌క్సెస్ ల‌తో దూసుకుపోతున్న నేచుర‌ల్ స్టార్ నాని `వైశాఖం`  హిట్ తో అంద‌రికీ మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు తీసుకురావాల‌ని ఆనందం వ్య‌క్తం చేశారు. ఇక మాస్ డైరెక్ట‌ర్ వి.వి.వినాయ‌క్, డ్యాషింగ్ డైరెక్ట‌ర్ పూరి జ‌గ‌న్నాథ్, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ వాళ్ల స్టైల్లో `వైశాఖం` ను బ్ల‌స్ చేశారు. ఇంత మంది టాలీవుడ్ స్టార్లు మెచ్చుకున్న సినిమా బ్లాక్ బ‌స్ట‌ర్ అవ్వాల‌ని మ‌ర‌స్ఫూర్తిగా కోరుకుందాం. ఈనెల  21 రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని  ఆర్. జె సినిమాస్ ప‌తాకంపై బి.ఏ రాజు భారీ బ‌డ్జెట్ తో నిర్మించిన సంగ‌తి తెలిసిందే.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మార్చి 23న ప్ర‌పంచ వ్యాప్తంగా 'రాజరథం' 
నిరూప్‌ భండారి, అవంతిక శెట్టి జంటగా అనూప్‌ భండారి దర్శకత్వంలో జాలీ హిట్స్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ నిర్మించిన చిత్రం 'రాజరథం'. అంజు వల్లభనేని, విషు...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
సుమంత్ తో `ఇదం జ‌గ‌త్`?
`మ‌ళ్లీ రావా` స‌క్సెస్ తో సుమంత్ మ‌ళ్లీ ఫేమ్ లోకి వ‌చ్చాడు. ఈ విజయం ఆయ‌న‌లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. స్టార్ గా మ‌ళ్లీ బిజీ అవుతున్నాడు. ప్ర‌స్...
powered by RelatedPosts