‘వైశాఖం` చిత్రాన్ని పెద్ద స‌క్సెస్ చేసిన ప్ర‌తి ఒక్క‌రికీ కృత‌జ్ఞ‌త‌లు – డైన‌మిక్ లేడీ డైరెక్ట‌ర్ జ‌య‌.బి

0

‘చంటిగాడు’, ‘గుండమ్మగారి మనవడు’, ‘లవ్‌లీ’ వంటి సూపర్‌హిట్స్‌ తర్వాత డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ బి. దర్శకత్వంలో రూపొందిన లేటెస్ట్‌ క్రేజీ చిత్రం ‘వైశాఖం’. ఆర్‌.జె. సినిమాస్‌ బేనర్‌పై హరీష్‌, అవంతిక జంటగా అభిరుచిగల నిర్మాత బి.ఎ.రాజు నిర్మించిన ‘వైశాఖం’ చిత్రం జూలై 21న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లోనూ అత్యధిక థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్‌ అయింది. సూపర్‌హిట్‌ టాక్‌తో సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అవుతుంది. ఈ సందర్భంగా శనివారం చిత్ర యూనిట్‌ సక్సెస్‌ మీట్‌ను హైదరాబాద్‌లోనిర్వహించింది. ఈ సందర్భంగా….

చిత్ర నిర్మాత బి.ఎ.రాజు మాట్లాడుతూ – ”వైశాఖం సినిమా ఈరోజు హిట్‌, సూపర్‌హిట్‌ టాక్‌తో రన్‌ అవుతుంది. హిట్‌ టాక్‌తో పాటు మంచి సినిమా తీశామని అప్రిసియేట్‌ కూడా చేస్తున్నారు. కొత్త హీరో హీరోయిన్‌తో చేసిన కథపై నమ్మకంతో చేసిన సినిమా ఇది. మానవీయ విలువలు తగ్గిపోతున్న ఈరోజుల్లో వాటిని గుర్తు చేసేలా ఆర్‌.జె.సినిమాస్‌ బ్యానర్‌ సినిమా చేసిందని అంటున్నారు. డైరెక్టర్‌ జయ నిజ జీవితంలో జరిగిన ఘటనను బేస్‌ చేసుకుని ఈ సినిమా కథను తయారు చేశారు. హీరో హీరోయిన్‌ పెర్‌ఫార్మెన్స్‌కు చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. హీరో హరీష్‌తో నెక్స్‌ట్‌ మూవీ కూడా చేయబోతున్నాం. ఇలాగే అందరి సహకారంతో ఇంకా మంచి సినిమాలను చేయాలని కోరుకుంటున్నాం. సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు, సహకారం అందించిన వారందరికీ థాంక్స్‌” అన్నారు.

డైనమిక్‌ లేడీ డైరెక్టర్‌ జయ.బి మాట్లాడుతూ – ”మీడియా రంగం నుండే నేను కూడా సినిమా రంగంలోకి అడుగు పెట్టాను. అందుకనే మీడియా వారిని నా స్వంత మనుషుల్లా భావిస్తుంటాను. వైశాఖం సినిమా విడుదలైన అన్ని సెంటర్స్‌లో హిట్‌ టాక్‌తో రన్‌ అవుతోంది. అమెరికా నుండి కూడా సినిమా మంచి టాక్‌ వచ్చింది. ఈ సినిమా కోసం ఏడాది పాటు బాగా కష్టపడ్డాం. క్లాస్‌, మాస్‌ ఆడియెన్స్‌ అందరినీ మెప్పించే సినిమాగా మన్ననలు పొందింది. మంచి టీం సహకారంతో సినిమాను బాగా తీయగలిగాను. ఓ మంచి సినిమాను ప్రేక్షకులకు అందించాను. నా నిజ జీవితంలో జరిగిన ఘటనను ఆధారంగా చేసుకుని ఈ సినిమాను చేశాను. మా నాన్నగారు చనిపోయినప్పుడు అప్పటి పరిస్థితుల్లో నేను ఎదుర్కొన మానసిక సంఘర్షణతో కథను తయారు చేసుకున్నాను. సినిమా చూసిన మా అమ్మగారు, మా కుటుంబ సభ్యులంతా ఎంతగానో మెచ్చుకున్నారు. ఓ కూతురిగా మా అమ్మగారికి నచ్చే సినిమా చేసినందుకు గర్వంగా ఉంది” అన్నారు.

హీరో హరీష్‌ మాట్లాడుతూ – ”వైశాఖం సినిమా జర్నీలో సపోర్ట్‌ చేసిన అందరికీ థాంక్స్‌. మంచి టీమ్‌తో కలిసి పనిచేశాను. సినిమాను జయగారు, రాజుగారు చాలా పెద్ద స్కేల్‌లో తీశారు. వీరిద్దరి కారణంగానే నేను బాగా ఎలివేట్‌ అయ్యాను. వీరితో మరో సినిమా చేయడానికి కూడా నేను సిద్ధమే. సినిమాను పెద్ద సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు థాంక్స్‌” అన్నారు.

హీరోయిన్‌ అవంతిక మాట్లాడుతూ – ”నేను సినిమాను సంధ్య థియేటర్‌లో చూశాను. ఆడియెన్స్‌ నుండి చాలా మంచి రెస్పాన్స్‌ వస్తుంది. సినిమాను సక్సెస్‌ చేసిన ప్రేక్షకులకు, సినిమా ఎంతో బాగా రూపొందించిన డైరెక్టర్‌ జయగారు, నిర్మాత బి.ఎ.రాజుగారికి థాంక్స్‌”అన్నారు.

సినిమాటోగ్రాఫర్‌ వాలిశెట్టి వెంకటసుబ్బారావు మాట్లాడుతూ – ”నేను సినిమాను కూకట్‌పల్లి శివపార్వతి థియేటర్‌లో చూశాను. పాటలు వస్తున్నప్పుడు ప్రేక్షకులు నుండి చాలా హ్యుజ్‌ రెస్పాన్స్‌ వస్తుంది. ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు థాంక్స్‌” అన్నారు.
సంగీత దర్శకుడు డి.జె.వసంత్‌ మాట్లాడుతూ – ”ఈ సినిమా చేయడానికి ముందుగానే డైరెక్టర్‌ జయగారు సినిమా మ్యూజికల్‌గా పెద్ద హిట్‌ అవుతుందని ప్రామిస్‌ చేశారు. నా నుండి మంచి మ్యూజిక్‌ను రాబట్టుకున్నారు. సినిమా విడుదల తర్వాత మ్యూజిక్‌ చాలా బావుందని అందరూ అంటున్నారు. మంచి సినిమాలో అవకాశం ఇచ్చిన జయగారికి, బి.ఎ.రాజుగారికి థాంక్స్‌” అన్నారు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

కొత్త కుర్రోడు` ఆడియో విడుద‌ల‌
శ్రీరామ్‌, శ్రీప్రియ హీరో హీరోయిన్లుగా లైట్ ఆఫ్ ల‌వ్ క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై రాజా నాయుడు.ఎన్ ద‌ర్శ‌క‌త్వంలో ప‌దిలం ల‌చ్చ‌న్న దొర‌(ల‌క్ష్మ‌ణ్‌) న...
రాజ్ కందుకూరి చేతుల మీదుగా `ద‌మ్ముంటే సొమ్మేరా` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
సంతానం, అంచ‌ల్ సింగ్ హీరో హీరోయిన్లుగా శ్రీ తెన్నాండాళ్‌ ఫిలింస్ బ్యాన‌ర్‌పై రూపొందిన `దిల్లుడు దుడ్డు` చిత్రాన్ని `ద‌మ్ముంటే సొమ్మేరా` టైటిల్‌తో...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
powered by RelatedPosts