`ఉ.పె.కు.హ` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

0

రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా ‘ఊ.పె.కు.హ’. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనేది కాప్షన్. సాక్షీ చౌదరి కథానాయిక. ‘నిధి’ ప్రసాద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ విడుదల చేశారు.

‘జెబి క్రియేషన్స్’ అధినేత విక్రమ్ మాట్లాడుతూ “సినిమా అనేది ఒక బిజినెస్. అందులో టార్గెట్ ఆడియన్స్. ఆడియన్స్ అంటే ముఖ్యంగా నెల టికెట్, మిడిల్ క్లాస్ బ్యాచ్. సినిమా స్టార్ట్ చేసే ముందు వాళ్ళను సినిమా ఆకట్టుకుంటుందా? లేదా? అని ఆలోచించాం. ప్రేక్షకులు పెట్టిన ప్రతి రూపాయికి ఈ సినిమా వినోదం అందిస్తుంది. మా బావగారు ‘నిధి’ ప్రసాద్ చాలా రిస్క్ తీసుకుని సినిమా చేశారు. సినిమాలో ఎంతోమంది ఆర్టిస్టులు, టెక్నీషియన్లు ఉన్నారు. వాళ్లంతా ఎంతో సహకరించారు” అన్నారు.

రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ “ఇప్పుడున్న నిర్మాతల ఛాయలు లేకుండా విక్రమ్ సినిమాను బాగా తీశాడు. అతను దర్శకుడు ‘నిధి’ ప్రసాద్ మేనత్త కొడుకు. సాధారణంగా సినిమాలు తీసేవాళ్ళలో రెండు రకాలు ఉంటారు. కడుపులో నీళ్లు కదలకుండా హ్యాపీగా సినిమా తీసేవాళ్ళు ఒకరు. ఎన్ని కష్టాలైనా పడి ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకునేవాళ్ళు ఇంకొకరు. ‘నిధి’ ప్రసాద్ తనను తాను కాంప్లికేటెడ్ చేసుకుని ప్రేక్షకులకు వినోదం ఇవ్వాలనుకుంటాడు. తనతో షూటింగ్ అంటే కష్టం. సినిమా అంతా బోలెడు మంది ఆర్టిస్టులున్నారు. తనతో షూటింగ్ జరిగినంత సేపు తిట్టుకుని, విడుదల తర్వాత హ్యాపీగా ఫీలయ్యే వాళ్లలో నేనూ ఒకణ్ణి. అంతకు ముందు అతనితో ‘అందరూ దొంగలే’, ‘మైఖేల్ మదన్ కామరాజు’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ చేశా. ఇక, ఈ సినిమా విషయానికి వస్తే కామెడీ అఫ్ ఎర్రర్స్ తో రూపొందింది. నేను భారీ బడ్జెట్ సినిమాలు చాలా చేశా. బడ్జెట్ కన్నా ఇంతమంది ఆర్టిస్టులతో సినిమా తీయడం చాలా కష్టం. ప్రేక్షకులు హాయిగా నవ్వుకునే సినిమా. వందశాతం ప్రేక్షకుల డబ్బుకి వినోదం అందిస్తుంది” అన్నారు.

దర్శకుడు ‘నిధి’ ప్రసాద్ మాట్లాడుతూ “షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో చాలామంది నటీనటులు, హాస్యనటులు నటించారు. ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశా. ప్రతి క్యారెక్టర్ కి ఒక్కో క్యారెక్టరైజేషన్ ఉంటుంది. స్క్రిప్ట్ పరంగా చాలా కాంప్లికేటెడ్ మూవీ. నేను చేసిన ‘అందరూ దొంగలే’, ‘మైఖేల్ మదన్ కామరాజు’, ‘భాగ్యలక్ష్మి బంపర్ డ్రా’ సినిమాల కంటే కాంప్లికేటెడ్ మూవీ. ఎక్కువ మంది ఆర్టిస్టులతో షూటింగ్ చేయడం కష్టం. ఎగ్జిక్యూటివ్ నిర్మాత నాగరాజు సహకారంతో సినిమా షూటింగ్ సజావుగా జరిగింది. సినిమా షూటింగులో కెమెరామన్, షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎడిటర్, రీ రికార్డింగ్ విషయంలో అనూప్ రూబెన్స్ చాలా కష్టపడ్డారు. సినిమా బాగా వచ్చింది. ఆద్యంతం నవ్విస్తుంది” అన్నారు.

సాక్షీ చౌదరి మాట్లాడుతూ “రాజేంద్రప్రసాద్ గారితో నటించే అవకాశం దక్కినందుకు చాలా గొప్పగా ఫీలవుతున్నా. వినోదం ఎప్పుడూ విజయవంతమైన ఫార్ములానే. అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందని నమ్ముతున్నా” అన్నారు.

“దర్శకుడు ‘నిధి’ ప్రసాద్ ప్రాణం పెట్టి సినిమా తీశార”ని ఎగ్జిక్యూటివ్ నిర్మాత నాగరాజు అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఊపెకుహ ఆడియో విడుద‌ల‌
రాజేంద్రప్రసాద్ ప్రధాన పాత్రలో జెబి క్రియేషన్స్ పతాకంపై శ్రీమతి భాగ్యలక్ష్మి నిర్మించిన సినిమా 'ఊ.పె.కు.హ'. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అ...
సుధీర్ బాబు తో ఇంద్ర‌గంటి `స‌మ్మోహ‌నం`
సుధీర్‌బాబు, బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రీ జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ న...
`డేర్` ఫ‌స్టులుక్ పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌!!
ప్ర‌వీణ్ క్రియేష‌న్స్ ప‌తాకంపై ఎన్. రామారావు నిర్మిస్తోన్న చిత్రం `డేర్`. ఎన్. క‌రుణాక‌ర్ రెడ్డి స‌మ‌ర్ప‌కుడు. న‌వీన్ హీరోగా ప‌రిచ‌యం అవుతున్నాడు...
powered by RelatedPosts