గుండు హ‌నుమంత‌రావుకు సినీ ప్ర‌ముఖుల నిశాళులు

0

గుండు హ‌నుమంతరావు మృతిప‌ట్ల పలువురు సినీ ప్రముఖులు ఎస్సార్‌ నగర్‌లోని ఆయన నివాసానికి వచ్చారు. హనుమంతరావుతో తమకున్న అనుబంధాన్ని పంచుకుంటూ క‌న్నీటి ప‌ర్యంతం చెందారు…

*‘గుండు హనుమంతరావు చనిపోయారన్న వార్త వినగానే అసలు నమ్మశక్యం కాలేదు. ఎందుకంటే నాకు, శివాజీ రాజాకు, హనుమంతరావుకు ఉన్న అనుబంధం అలాంటిది. ఆయన చనిపోయారనగానే ఏదో తెలీని అలజడి. వెంటనే శివాజీ రాజాకు ఫోన్‌ చేశాను. చాలా సార్లు గుండు హనుమంతరావు ఇంటికి వెళ్లాను. వెళ్లిన ప్రతీసారి ఎంతో ఆప్యాయతగా పలకరించేవారు. కల్మషం లేని వ్యక్తి’ అని బ్రహ్మానందం కంటతడి పెట్టారు.

* ‘గుండు హనుమంతరావు మంచి ఆర్టిస్ట్‌. మంచి వ్యక్తి. ఏ సన్నివేశం ఇచ్చినా కామెడీకి కామెడీ.. సెంటిమెంట్‌కి సెంటిమెంట్‌ పండించేవారు. ఇంత మంచి ఆర్టిస్ట్‌ ఒక రేంజ్‌కి ఎదుగుతారని అనుకున్నాం కానీ అలా రాలేకపోవడం నిజంగా దురదృష్టం. ఆయన లేకపోవడం చాలా బాధాకరం. ‘రాజేంద్రుడు గజేంద్రుడు’ సినిమాలో గుండు పాత్రను ఆయన కోసమే రాశాను. ఎలాంటి కామెడీనైనా పండించగల వ్యక్తి గుండు హనుమంతరావు. ఇప్పటికీ ఆయన కామెడీ స్టైల్‌ వేరు.’- ఎస్వీ కృష్ణారెడ్డి

* ‘హనుమంతరావు, బ్రహ్మానందం, నేను ఒకేసారి చిత్ర పరిశ్రమలోకి వచ్చాం. 30 ఏళ్ల పరిచయం మాది. ‘అమృతం’ సీరియల్‌తో మా ఇద్దరికి మంచి పేరు వచ్చింది. తన ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా..‘శివ ఇంటికి రా’ అని పిలిచేవారు. మా 30 ఏళ్ల పరిచయంలో హనుమంతరావు ఎవరి ఇంటికైనా ఖాళీ చేతులతో వెళ్లడం చూడలేదు. అతని భార్య పోవడం చూశాను, కూతురు పోవడం చూశాను. కానీ హనుమంతరావు ఇంత త్వరగా వెళ్లిపోతాడని అనుకోలేదు’- శివాజీ రాజా

* ‘నాకు, గుండు హనుమంతరావుకి ఎప్పటినుంచో పరిచయం ఉంది. నాటక రంగంలోకి వచ్చి అక్కడినుంచి సినిమా రంగానికి వచ్చారు. ఎన్నో దేశాల్లో దాదాపు 3000 ప్రోగ్రామ్‌లలో పాల్గొని మంచి పేరు తెచ్చుకున్నారు. అలాంటి మంచి మనిషి ఈరోజు లేరంటే నమ్మలేకపోతున్నాను’- మురళీ మోహన్‌

* ‘గొప్ప నటుడు, మంచి వ్యక్తి. మీరు ఈ లోకంలో లేకపోయినా మిమ్మల్ని ఎన్నటికీ మర్చిపోలేం.’- మంచు మనోజ్‌

* ‘గుండు హనుమంతరావు చనిపోవడం నిజంగా చాలా బాధాకరం. మీ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను’- సుధీర్‌ బాబు

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
powered by RelatedPosts