తొలిప్రేమ స‌క్సెస్ మీట్

0

వ‌రుణ్ తేజ్‌, రాశీ ఖ‌న్నా జంట‌గా న‌టించిన సినిమా `తొలి ప్రేమ‌`. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ నిర్మాత‌. బాపినీడు స‌మ‌ర్పించారు. ఈ సినిమా థాంక్స్ మీట్ బుధ‌వారం హైద‌రాబాద్‌లో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న‌బీవీయ‌స్‌య‌న్ ప్ర‌సాద్ మాట్లాడుతూ “ఈ సినిమాను నమ్మి చేశాను. ఈ చిత్రానికి న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు అందరూ బాగా సెట్ అయ్యారు“ అని అన్నారు.

దిల్‌రాజు మాట్లాడుతూ “ప్ర‌తి టెక్నీషియ‌నూ త‌మ వంతుగా ఈ సినిమాకు అత్యుత్త‌మంగా కృషి చేశారు. వెంకీ ఒక రోజు నా ముందు కూర్చుని ఈ క‌థ‌ను బీవీయ‌స్‌య‌న్‌గారితో చేయ‌డానికి సిద్ధ‌మైన‌ట్టు చెప్పారు. నేను స‌రేన‌నుకున్నా. ఒక అసిస్టెంట్ డైర‌క్ట‌ర్ వెయిటింగ్‌లో ఉన్న‌ప్పుడు ప‌డే ఆవేద‌న నాకు తెలుసు. ఎమోష‌న్స్, రిలేష‌న్స్ నాకూ బీవీయ‌స్‌య‌న్ కుటుంబానికి మ‌ధ్య బాగా ఉన్నాయి. అందుకే ఈ సినిమా మ‌ర‌లా నా చేతుల్లోకి వ‌చ్చింది. క‌రుణాక‌ర‌న్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ గారితో `తొలిప్రేమ‌`ను క్రియేట్ చేస్తే, ఇప్పుడు వెంకీ అట్లూరి మ‌ర‌లా క్రియేట్ చేశారు. `ఫిదా` త‌ర్వాత వ‌రుణ్ తేజ్ మ‌ర‌లా ఈ సినిమాలో చాలా బాగా చేశారు. మూడు పాత్ర‌ల్లో త‌ను చూపించిన వైవిధ్యం అంద‌రినీ మెప్పించింది“ అని అన్నారు.

వెంకీ అట్లూరి మాట్లాడుతూ “నా తొలి అటెంప్ట్ ని ఆద‌రించినందుకు ధ‌న్య‌వాదాలు. కెమెరామేన్ జార్జి నాకు చాలా స్పెష‌ల్‌. ఈ సినిమాకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. రాశీని ఈ సినిమాలో చూసిన వారంద‌రూ ఇంట్లో అమ్మాయిలా ఇష్ట‌ప‌డుతుండ‌టం నాకు చాలా బాగా న‌చ్చింది. వ‌రుణ్ న‌మ్మ‌డం వ‌ల్లే ఈ సినిమా పురుడుబోసుకుంది“ అని చెప్పారు.

వ‌రుణ్ తేజ్ మాట్లాడుతూ “ఈ సినిమా క‌థ‌ని అందరూ న‌మ్మి చేశారు. అంద‌రిక‌న్నా ముందు దిల్‌రాజుగారు న‌మ్మారు. అట్లూరి వెంకీకి నేను రుణ‌ప‌డి ఉంటాను. వెంకీ చాలా ఇష్ట‌ప‌డి చేసుకున్న స‌బ్జెక్ట్ ఇది. ఆద్యంతం క‌న్విక్ష‌న్ ఉంటుంది. చిరంజీవిగారు సినిమా చూసి షాక్ అయ్యారు. డెబ్యూ డైర‌క్ట‌ర్ ఇంత బాగా చేశారా అని చిరంజీవిగారు షాక్ అయ్యారు. సినిమా విడుద‌ల‌య్యాక నాది, రాశీ ఖ‌న్నాది ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బావుంద‌ని చాలా మంది అంటున్నారు. ఆఫ్ స్క్రీన్ జార్జి, త‌మ‌న్‌, వెంకీ అట్లూరి మ‌ధ్య బాండింగ్ చాలా బావుంటుంది. సినిమాను వారు ప్రేమించిన విధానం, చేసిన హార్డ్ వ‌ర్క్ ఈ సినిమాలో రిఫ్లెక్ట్ అవుతుంది. ప్ర‌తి టెక్నీషియ‌న్ చాలా బాగా చేశారు“ అని చెప్పారు.

త‌మ‌న్ మాట్లాడుతూ “మా నిర్మాత‌గారు బొద్దుగా ఉంటారు. ఆయ‌న మ‌న‌సంతా ప్రేమ‌తో నిండి ఉంటుంది. టెక్నీషియ‌న్ల‌ను ఎక్స్ ట్రా కేర్ తీసుకుని సినిమా చేస్తుంటారు. సంగీతం స‌క్సెస్‌లో స‌గం నేను ఆయ‌న‌కే ఇస్తాను. ఫ‌క్తు క‌మ‌ర్షియ‌ల్ సినిమా ఇది. సినిమా రీరికార్డింగ్‌కి వ‌చ్చిన‌ప్పుడు చూడ‌గానే పీల్ న‌చ్చింది. చాలా జాగ్ర‌త్త‌గా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చేశాను“ అని చెప్పారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సుధీర్ బాబు తో ఇంద్ర‌గంటి `స‌మ్మోహ‌నం`
సుధీర్‌బాబు, బాలీవుడ్ న‌టి అదితిరావు హైద‌రీ జంట‌గా మోహ‌న‌కృష్ణ ఇంద్ర‌గంటి ద‌ర్శ‌క‌త్వంలో శ్రీదేవి మూవీస్ ప‌తాకంపై శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ న...
రామ్ తో ప్రవీణ్ స‌త్తారు మూవీ
గ‌రుడ‌వేగ` హిట్ తో ప్ర‌వీణ్ స‌త్తారు పేరు టాలీవుడ్ అంత‌టా మారు మ్రోగిపోయింది. జాతీయ అవార్డు తెచ్చిపెట్టిన సినిమా సైతం ఇవ్వ‌ని పేరు ప్ర‌ఖ్యాత‌ల్ని...
ముగ్గురు మొన‌గాళ్ల తొలిరోజు స‌త్తా!
సంక్రాంతి తర్వాత మరోసారి బాక్సాఫీస్‌ వద్ద సందడి నెలకొంది. ఈ వారం విడుదలైన ‘తొలిప్రేమ’, ‘గాయత్రి’, ‘ఇంటిలిజెంట్‌’ చిత్రాలు ఒకదానితో ఒకటి పోటీ పడుత...
powered by RelatedPosts