ఇదంతా మీ అభిమానమే..!!

0

ashabhosle-b-26-4-2013ఆమె గొంతులో అమృతం దాగున్నదేమో? ఆమె మనిషి రూపం తొడిగిన కోకిలేమో? ఇలాంటి ఉపమానాలు ఎన్ని పెట్టినా ఆవిడ స్థాయికి తక్కువే.
గత నాలుగు దశాబ్దాలకి పైగా తన అమోఘమైన స్వరంతో సంగీతాభిమానులని అలరిస్తున్న సుమధుర గాయని ఆశాభోంస్లే తాజాగా తన 82 ఏటా అడుగుపెట్టారు. వివిధ భాషల్లో దాదాపు 12 వేలకు పైగా పాటలు పాడిన ఈ ‘పద్మవిభూషణ్’ పురస్కార గ్రహీత ఇన్నేళ్ళ తన స్వర ప్రయాణానికి సహకరించిన సినీ వర్గీయులకూ, అభిమానులకూ పేరు పేరునా కృతజ్ఞతలు తెలిపారు. వారందరి అభిమానం, అండదండల వల్లే దేశంలోని బహుముఖ ప్రజ్ఞావంతులైన గాయనీమణుల్లో ఒకరిగా పేరు తెచ్చుకోగలిగినట్లు ఆమె అభిప్రాయపడ్డారు.

‘‘నా జన్మదినం సందర్భంగా అభినందనలు తెలిపిన వారందరికీ పేరు పేరునా కృతజ్ఞతలు. మీ అండదండలు లేనిదే నేను నా లక్ష్యాలను చేరుకోగలిగేదాన్ని కాదు. రాబోయే రోజుల్లో కూడా మీరు నా వెంటే ఉండాలని కోరుకుంటున్నాను’’ అని ఆశా భోంస్లే పేర్కొన్నారు. సుప్రసిద్ధ గాయని లతా మంగేష్కర్‌కు చెల్లెలైన ఆశా భోంస్లే అలనాటి మధుబాల, హెలెన్, ఆశా పారేఖ్‌ల దగ్గర నుంచి ఇటీవలి ఊర్మిళా మాతోండ్కర్, కరీనా కపూర్ దాకా అందరికీ తన గళంతో ఎన్నో సూపర్‌హిట్ గీతాలిచ్చారు. ఇప్పటికీ ఆమె వేదికపై పాటలు పాడుతుంటే, హాలు నిండిపోవాల్సిందే. ఈ ఏడాది ప్రథమార్ధంలో ప్యారిస్‌లో జరిగిన ఆశా భోంస్లే సినీ సంగీత విభావరిలో ఆ దృశ్యమే కనపడింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts