వాళ్ళు నా కూతుళ్ళు కారు: అమీర్ ఖాన్

0

aamir-khan-wallpapersబాలీవుడ్ సంచలన హీరో అమీర్ ఖాన్ ఏది చేసినా అది సంచలనమే అవుతుంది. మొన్నీ మధ్య అమీర్ నటించిన “పీకే” చిత్రం ఎంతటి సంచలన విజయం సాధించిందో మనందరికీ తెలిసిందే. ఇక ప్రస్తుతం ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ లేటెస్ట్ మూవీ ‘దంగాల్’ షూటింగ్ ఆరంభానికి ముందే క్రేజీ టాక్ తెచ్చేసుకుంటోంది. ఇందులో రెజ్లర్ పాత్ర పోషించనున్న ఆమిర్ తన పుట్టిన రోజు సందర్భంగా చిత్రానికి సంబంధించి కొన్ని వివరాలు వెల్లడించాడు.

ఇది ‘అవుటాఫ్ ది బాక్స్’ స్టోరీ అని, డిఫరెంట్ లేయర్స్‌లో క్యారెక్టర్స్ ఉంటాయని చెప్పాడు. ‘ఈ చిత్రం కోసం నేనూ ఎంతో ఉత్సుకతో ఎదురు చూస్తున్నా. ఓ తండ్రి అతని ఇద్దరు కూతుళ్ల మధ్య నడిచే కథ ఇది’ అన్న ఆమిర్… ఇందులో తాప్సీ, కంగనా రనౌత్, అక్షర హాసన్‌లు తన కూతుళ్లుగా నటిస్తున్నారన్న వార్తలను ఖండించాడు. అవన్నీ రూమర్లనీ, ఇంకా కాస్టింగ్ ఫైనలైజ్ కాలేదని చెప్పాడు!

ఎవరు పుట్టిస్తారో ఇలాంటి రూమర్లని కానీ, ఏ విషయం తేలే వరకూ అభిమానులలో ఎక్కడ లేని ఉత్కంఠ మాత్రం ఖాయం అని చెప్పుకోవచ్చు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

powered by RelatedPosts