ఘ‌నంగా సేవ‌-పౌరాణిక రంగ‌స్థ‌ల అవార్డుల ప్ర‌ధానం.. `తెలుగు చ‌ల‌న చిత్ర త్రిమూర్తులు` బుక్ లాంచ్!

0

ఫిలిం ఎన‌లిటిక‌ల్ అండ్ అప్రిసియేష‌న్ సోసైటీ (పాస్) సంస్థ ఆధ్వ‌ర్యంలో త్యాగ‌రాయ‌గాన స‌భ‌లో `సేవ‌-పౌరాణిక రంగ‌స్థ‌ల` అవార్డుల ప్ర‌ధాన స‌భ ఘ‌నంగా నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా సంస్థ నిర్వాహ‌కులు కె. ధ‌ర్మారావు రూప‌క‌ర్త‌గా వ్వ‌వ‌హ‌రించ‌గా, ర‌చ‌యిత జ‌న్నాభ‌ట్ల న‌ర‌సింహప్ర‌సాద్ ర‌చించిన సంగీత‌, నృత్య‌, సాహిత్య (తెలుగు చ‌ల‌న చిత్ర త్రిమూర్తులు) గ్రంధావిష్క‌ర‌ణ‌తో పాటు, నాట‌క క‌ళోత్స‌వం నిర్వ‌హించారు. దాస‌రి నారాయ‌ణ‌రావు, సినారె, అక్కినేని నాగేశ్వ‌ర‌రావు ల గురించి ర‌చించిన తెలుగు చ‌ల‌న చిత్ర త్రిమూర్తుల పుస్త‌కాన్ని సినీ ద‌ర్శ‌కుడు రాజా వ‌న్నెం రెడ్డి ఆవిష్క‌రించి తొలి ప్ర‌తిని `సంతోషం` సినీ ప‌త్రిక ఎడిట‌ర్ సురేష్ కొండేటికి అందించారు.

అలాగే కాజులూరి వెకంట‌రామారావు సేవా అవార్డును సినీ న‌టుడు గౌతం రాజు ప‌క్షాన ఆయ‌న కుమారుడు వ‌ర్ధ‌మాన హీరో కృష్ణంరాజు అందుకున్నారు. కాజులూరి నిర్వాహ‌క అవార్డును సి.హెచ్ స్వామినాయుడు, దేవ‌గుప్త‌పు సూర్య‌నారాయ‌ణ హ‌ర్మోనిస్ట్ అవార్డును టి. రాజ‌బాబు, గాన‌కోకిల డి.సూర్యం శ్రీకృష్ణ అవార్డును టి. బాబు రాజ్, కాజులూరి వీర‌భ‌ద్ర‌రావు దుర్యోధ‌న అవార్డును డా. పిల్లుట్ల ల‌క్ష్మీకాంత‌శ‌ర్మ‌లు అందుకున్నారు. ముఖ్య అతిధిగా పాల్గొన్న త‌మిళ‌నాడు మాజీ గ‌వ‌ర్న‌ర్ డా. కొణిజేటి రోశ‌య్య అవార్డుల‌ను అంద‌రికీ అంజేశారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ఇలాంటి కార్య‌క్ర‌మాలు ప్రేక్ష‌కుల్లో ఎంతో సంతోషాన్ని, స్పూర్తిని నింపుతాయ‌న్నారు. ఈ కార్య‌క్ర‌మంలో కవి ఎం.కె రాము, డా. భాస్క‌ర‌రెడ్డి, సి.క‌మ‌లాప్ర‌సాద‌రావు, డా. ధ‌ర్మారావు, ప‌వ‌న్, వైద్యుల మైత్రేయ త‌దిత‌ర‌లు పాల్గొన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

ఏప్రిల్ 28న మెగాస్టార్ చిరంజీవి అతిధిగా అమెరికాలో మా తొలి ఈవెంట్!
`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో...
సైబ‌ర్ క్రైమ్ సీఐడీ రామ్మోహ‌న‌రావుకు `మా` నాట‌కోత్స‌వాల‌ ఆహ్వానం!
యు.రామ్మోహ‌నరావు ( సూప‌రిడెంట్ ఆఫ్ పోలీస్, సైబ‌ర్ క్రైమ్ సి.ఐడీ, హైద‌రాబాద్) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న సంద‌ర్భంగా `మా` మూవీ ఆర్టిస్...
అవంతిక ఆడియో ఆవిష్క‌ర‌ణ‌
ప్రముఖ నిర్మాత తుమ్మలపల్లి రామసత్యనారాయణ నిర్మాతగా భీమవరం టాకీస్‌ బేనర్‌పై కె.ఆర్‌. ఫణిరాజ్‌ సమర్పణలో 'అవును' ఫేమ్‌ పూర్ణ ప్రధాన పాత్రలో శ్రీరా...
powered by RelatedPosts