కాజల్ పై కస్సుమన్న తమిళ హీరో

0

download (2)పని చేయడానికి తీసుకున్న డబ్బుని, ఆ పని చేయని పక్షంలో తిరిగి ఇవ్వాలి అనే కామన్ సెన్స్ ఉండాలి కదా… లేనప్పుడు ఇలాగే ఎవరైనా కస్సుబుస్సుమంటారు. అందుకే, తమిళ హీరో- నిర్మాత ఉదయనిధి స్టాలిన్ ముద్దుగుమ్మ కాజల్ అగర్వాల్ పై తమిళ చిత్ర నిర్మాతల సంఘంలో కంప్లైంట్ చేశాడు. ‘నన్బెండా’ అనే చిత్రంలో నటించేందుకుగాను కాజల్ అగర్వాల్ కు 40 లక్షల రూపాయలను అడ్వాన్సుగా చెల్లించారు. ఆ సినిమాలో కాజల్ నటించలేదు. తన డబ్బులు తనకు తిరిగి ఇప్పించాల్సిందిగా నిర్మాతల సంఘంను ఉదయనిధి స్టాలిన్ కోరారు.

‘నన్బెండా’లో ఉదయనిధి స్టాలిన్ సరసన హీరోయిన్ గా నయనతార నటించింది. అయితే కాజల్ అగర్వాల్ 40 లక్షల రూపాయల అడ్వాన్సు తిరిగి ఇవ్వకుండా ఉదయనిధి స్టాలిన్ హీరోగా తెరకేక్కబోయే తర్వాత సినిమాలో నటించేలా కాజల్ ఒప్పందం చేసుకుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోవడంతో 40 లక్షలను ఇవ్వవలసిందిగా ఉదయనిది స్టాలిన్ కోరుతున్నారు.

ప్రస్తుతం కాజల్ అగర్వాల్ వరుస సినిమాలతో చాలా బిజీగా ఉంది. తెలుగులో ‘గోవిందుడు అందరివాడేలే’, ఎన్టీఆర్ – పూరి జగన్నాధ్ సినిమా, తమిళంలో మరొక సినిమాలో నటిస్తుంది. డేట్స్ అడ్జస్ట్ చేయలేక హిందీ సినిమాలో నటించే అవకాశం వదులుకుంది. అయితే ఉదయనిధి నెక్స్ట్ సినిమాలో హన్సిక నటిస్తుంది అంటూ చెన్నై మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది.

ఇంత జరిగాక కూడా కాజల్ ఉదయ్ కి డబ్బులు తిరిగి ఇవ్వడానికి వచ్చిన ఇబ్బంది ఏమిటో మరి… ప్చ్..!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Yuddham Sharanam' title song will be out tomorrow
The Second single from Chay Akkineni, Lavanya Tripathi & Srikanth's #YuddamSharanam will be out tomorrow at 3 pm. Music by 'Pellichoopulu' fa...
 మెగాస్టార్ కి కృత‌జ్ఞ‌త‌లు: త‌మిళ‌నాడు తెలుగు యువ శ‌క్తి
మెగాస్టార్ కి జన్మదిన శుభాకాంక్షలు. మా మాటను మన్నించి  తొలి తెలుగు స్వాతంత్ర్య సమారా యోధుడు   జీవిత చరిత్ర సినిమాకు సై.. సై.. రా నరసింహారెడ్డి టై...
నా పరిచయ చిత్రం "ప్రేమ ఎంత మధురం ప్రియురాలు అంత కఠినం" కావడం నా అదృష్టం!!
'చంద్రకాంత్-రాధికా మెహరోత్రా'లను హీరోహీరోయిన్లుగా పరిచయం చేస్తూ.. 'థర్డ్ ఐ క్రియేషన్స్' పతాకంపై.. 'రఘురాం రొయ్యూరు'తో కలిసి.. గోవర్ధన్,జి స్వీయ ద...
powered by RelatedPosts