శ్రుతిహసన్ ప్లేసులో తమన్నా..

0

tammaవైట్ బ్యూటీ శ్రుతీహాసన్ పై పీవీపీ సంస్థ వారు వేసిన కోర్ట్ కేసు ప్రస్తుతం టాలీవుడ్ ను ఊపేస్తోంది. ఈ నేపథ్యంలో శ్రుతి ఇకపై ఏ చిత్రానికి సంతకం చేయకూడదని కోర్ట్ ఆర్డర్ వేయడంతో… ఈ వివాదం మరింత ముదిరింది. అయితే… సందట్లో సడేమియా అంటూ ఈ సీన్ అంతా మిల్కీ బ్యూటీకి కలసి వచ్చేట్టు కనిపిస్తుండటంతో.. అమ్మడు తెగ సంబరపడిపోతోందట….
నాగార్జున- కార్తీ ప్రధాన పాత్రల్లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ సంస్థ తెరకెక్కిస్తున్న సినిమాలో శ్రుతీహాసన్ ను హీరోయిన్ గా ఫైనలైజ్ చేశారు! అయితే శ్రుతి ఈసినిమా చేయనని వైదొలగడంతో… ఇప్పుడు ఆ ప్లేస్ ను ఎవరు భర్తీ చేస్తారన్న అంశం తెరపైకి వచ్చింది…. అయితే మిల్కీ బ్యూటీ తమన్నా ఈ ఆఫర్ ఎగరేసుకుపోయేట్టు కనిపిస్తోంది…. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉన్నప్పటికీ… ప్రస్తుతం తమన్నా తప్ప ఇంకో స్టార్ హీరోయిన్ అందుబాటులో లేకపోవడంతో అమ్మడికే దర్శక-నిర్మాతలు పట్టం కట్టడం ఖాయమని వినిపిస్తోంది.

ఫ్రెంచ్ మూవీ ది ఇన్ టచబుల్ కు అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటిచేందుకు కాజల్, సమంత వంటి ముద్దుగుమ్మల పేర్లు పరిశీలిద్దామంటే.. వారి డేట్లను చేజిక్కించుకోవడం దాదాపు అసాధ్యమనే చెప్పాలి…. అంజలి, రకుల్ ప్రీత్ సింగ్ ఈ సినిమాలో నటిచాలని ఉవ్విళ్లూరుతున్నప్పటికీ… వారి డైరీలు కూడా ఫుల్ గా ఉన్నాయి… సో… ఏ విధంగా చూసినా ప్రస్తుతం మిల్కీ బ్యూటీ తమన్నానే పీవీపీ బ్యానర్ పై తెరకెక్కబోయే చిత్రానికి బెస్ట్ ఛాయిస్ గా కనిపిస్తోంది. మరి… ఈ మల్టీస్టారర్ లో తమన్నా హీరోయిన్ గా ఫైనలైజ్ అవుతుందో లేదో తెలియాలంటే.. మరి కొద్ది రోజులు ఓపిక పట్టాల్సిందే..!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts