మజీ ప్రియుడితో మళ్ళీ కలిసిన తమన్నా!

0

Tamanna-Aagadu-MOvie‘ఆవారా’ ఫేం కార్తీ, తమన్నా మధ్య ఓ లవ్ స్టోరీ ఉందనే వార్తలు కోలీవుడ్ లో చాలా జోరుగా ప్రచారం అయ్యేయి. ఈ ఇద్దరూ కలిసి ‘పయ్యా’ (తెలుగులో ఆవారా) , ఆ తర్వాత ‘సిరుతై’ చిత్రాల్లో నటించారు. ‘పయ్యా’ చిత్రం సమయంలో కార్తీ, తమన్నా చాలా ఘాటుగా ప్రేమించుకుంటున్నారని, ఈ ఇద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు వచ్చాయి. అయితే కార్తీ తండ్రి శివకుమార్ కి వీరి ప్రేమ ఇష్టంలేదని, దాంతో కార్తీ సరసన తమన్నాని తీసుకోవద్దని అప్పట్లో కొంతమంది నిర్మాతలకు శివకుమార్ చెప్పారని కోలీవుడ్ వర్గాలు అంటుంటాయి. ఇంట్లో అంగీకరించకపోవడంతో కార్తీ కూడా తమన్నాని వదిలేసి, ఇంట్లో ఫిక్స్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని చెప్పుకునేవారు. ఆ తర్వాత తమన్నాకి కోలీవుడ్ లో అవకాశాలు తగ్గడం టాలీవుడ్ లో అవకాశాలు రావడంతో తమన్నా టాలీవుడ్ లో సెటిల్ అయిపోయింది.

ప్రస్తుతం తమిళంలో సినిమాలు చేస్తోంది కానీ, మాజీ ప్రియుడు కార్తీతో మాత్రం జత కట్టలేదు. అయితే త్వరలో కార్తీ, తమన్నా ఓ సినిమాలో జంటగా నటించబోతున్నారని సమాచారమ్. కింగ్ నాగార్జున, ‘ఆవారా’ ఫేం కార్తీ కాంబినేషన్ లో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పివిపి సంస్థపై పొట్లూరి ప్రసాద్ ఓ భారీ మల్టీస్టారర్ చిత్రానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో శృతిహాసన్ ని కథానాయికగా తీసుకున్నారు. కానీ డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని చెప్పి శృతిహాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. దీనిపై పివిపి సంస్థ కోర్టుకెక్కింది. కాగా తాజా వార్తల ప్రకారం శృతిహాసన్ స్థానంలో తమన్నాని తీసుకున్నారని తెలుస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts