మహేష్-శంకర్ సినిమా ఒట్టి పుకారేనట..!!

0

shankar(5)మొదటినుంచీ వైవిధ్యమైన కథాంశాలని ఎంచుకుంటూ గత పదిహేనేళ్లకు పైగా ఉత్తమ దర్శకునిగా నీరాజనాలని అందుకుంటున్న దర్శకుడు శంకర్. భారతీయ సినిమా స్టామినాని “రోబో” చిత్రంతో అంతర్జాతీయ స్థాయిలో అందరికీ రుచి చూపించిన ప్రతిభాశీలి శంకర్. ప్రస్తుతం శంకర్ హీరో విక్రమ్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న “ఐ” చిత్రం మీదనే అందరి కళ్ళూ ఉన్నాయి. అగ్రదర్శకుడిగా పేరు తెచ్చుకున్న శంకర్ తో ప్రస్తుతానికి తాను ఎలాంటి సినిమా చేయడం లేదని సూపర్ స్టార్ మహేశ్ బాబు స్పష్టం చేశాడు. ‘ఆగడు’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు ఈనెల 19న వస్తున్న మహేశ్.. తన రాబోయే చిత్రం మాత్రం శంకర్ తో కాదని తెలిపాడు. ఆగస్టు 30వ తేదీన జరిగిన ‘ఆగడు’ ఆడియో ఆవిష్కరణ కార్యక్రమానికి శంకర్ ముఖ్య అతిథిగా వచ్చిన విషయం తెలిసిందే. అయితే, అందుకు ప్రత్యేక కారణం ఏమీ లేదని, తాను శంకర్ దర్శకత్వంలో సినిమా ఏమీ చేయడంలేదని మహేశ్ తెలిపాడు.

‘ఆగడు’ సినిమా విడుదల కాగానే తన తదుపరి ప్రాజెక్టులో బిజీగా ఉంటానని ఈ సూపర్ స్టార్ చెప్పాడు. కొరటాల శివ దర్శకత్వంలో మహేశ్ తదుపరి సినిమా తీయబోతున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అక్టోబర్ 2 నుంచి ప్రారంభం అవుతుంది. తాను శంకర్ దర్శకత్వం వహించిన ‘ఐ’ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమంలో కూడా తాను పాల్గొనబోవడం లేదని మహేశ్ చెప్పాడు. ఆ సమయానికి తాను వేరే కార్యక్రమాల్లో బిజీగా ఉంటానని చెబుతూ.. శంకర్ టీమ్ కు అభినందనలు తెలిపాడు.

సో….అదండీ విషయం…!! శంకర్ తో మహేష్ సినిమా చేయడం లేదు….ఆడియో ఫంక్షన్ కి కూడా వెళ్ళడం లేదు…!! స్వయంగా మహేష్ బాబే ఈ విషయాన్ని ధృవీకరించిన నేపధ్యంలో,ఈ విషయమై ఇక ఎలాంటి పుకార్లను అభిమానులు నమ్మవద్దు..!!

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts