ప్ర‌పంచ‌వ్యాప్తంగా అగ‌ష్టు మూడ‌వ వారంలో “ఉంగరాల రాంబాబు” విడుద‌ల‌

0

Sunil

సునీల్ హీరోగా, మియాజార్జ్ జంట‌గా, క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విడుద‌ల‌కి సిధ్ధ‌మైన చిత్రం ఉంగరాల రాంబాబు. ప‌లు విజయవంతమైన చిత్రాల్ని నిర్మించిన నిర్మాత పరుచూరి కిరీటి. యునైటెడ్ కిరిటీ మూవీస్ లిమిటెడ్ బ్యానర్ పై ఉంగరాల రాంబాబు చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అన్ని కమర్షియల్ హంగుల్ని రంగరించి నిర్మిస్తున్న ఉంగరాల రాంబాబు చిత్రం సునీల్ అన్ని చిత్రాల కంటే హై స్టాండ‌ర్డ్ లో వుంటుంది. సునిల్ చిత్రాల నుంచి ప్రేక్షకులు ఆశించే అన్ని అంశాలతో పాటు.. క్రాంతి మాధవ్ తరహా మేకింగ్ తో పాటు… నిర్మాత పరుచూరి కిరీటి చిత్రాల్లో కనిపించే కమర్షియల్ హంగులు ఈ చిత్రంలో కనిపించనున్నాయి. స్టార్ కెమెరామెన్ సర్వేశ్ మురారి సినిమాటోగ్రఫి అందిస్తుండడం విశేషం. ఇప్ప‌టికే హీరో సునీల్ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయి. ప్ర‌స్తుతం డిటియ‌స్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుని రెండు వారాల్లో సెన్సారు కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటానికి సిధ్ధ‌మ‌వుతుంది. అన్ని కార్య‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు మూడ‌వ వారంలో చిత్రాన్ని విడుద‌ల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ ” మా దర్శకులు క్రాంతి మాధవ్ త‌ర‌హ‌లో వుంటూనే సునిల్ పాట్ర‌న్ కామెడితో తెలుగు ప్రేక్ష‌కుల్ని అమితంగా ఆక‌ట్టుకునేలా మా ఉంగ‌రాల రాంబాబు వుంటుంది. ఇప్ప‌టికే ఆల్ ఏరియా బిజినెస్ ని పూర్తిచేసుకున్న‌ ఈ చిత్రం ప్ర‌స్తుతం హీరో సునీల్ డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు మ‌రియు డి.టి.య‌స్ కార్య‌క్ర‌మాల్లో బిజిగా వుంది. ఇప్ప‌టికే విడ‌దల చేసిన సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ రావ‌టంతో చిత్రం పై మంచి అంచ‌నాలు వున్నాయి. త‌ప్ప‌కుండా అంద‌రి అంచ‌నాలు అందుకుని ఈ చిత్రం ఘ‌న‌విజ‌యం సాధిస్తుంది. 2017 బెస్ట్ కామెడి ఎంట‌ర్‌టైన‌ర్ గా మా చిత్రం నిలుస్తుంద‌నే న‌మ్మ‌కం మా యూనిట్ కి వుంది. ముఖ్యంగా ప్ర‌కాష్‌రాజ్ , పోసాని కృష్ణ‌ముర‌ళి, వెన్నెల కిషోర్‌, ఆలీ, ఆశిష్ విద్యార్థి, రాజా ర‌వీంద్ర లు న‌ట‌న ఈ చిత్రానికి ప్ర‌త్య‌ఖంగా నిలుస్తుంది. ఈచిత్రాన్ని అన్ని కార్క‌క్ర‌మాలు పూర్తిచేసి అగ‌ష్టు మూడ‌వ వారంలో విడుదల చేస్తాము. ఈ చిత్రం అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల్ని క‌డుపుబ్బ న‌వ్విస్తుంద‌ని న‌మ్ముతున్నాం. అని అన్నారు.

నటీ నటులు – సునీల్, మియా జార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని కృష్ణ మురళి, ఆశిష్ విద్యార్థి, ఆలీ, వెన్నెల కిషోర్, రాజీవ్ కనకాల, రాజా రవీంద్ర, మధు నందన్, ప్రభాస్ శ్రీను, తాగుబోతు రమేష్, దువ్వాసి మోహన్, సత్తెన్న, చిత్రం శ్రీను, సత్యం రాజేష్, విజయ్ కుమార్, నల్ల వేణు, అనంత్, మిర్చి హేమంత్, ఐమాక్స్ వెంకట్, రమణా రెడ్డి, శ్రీ హర్ష, శివన్ నారాయణ, మాస్టర్ హన్సిక్, కె.ఎల్.ప్రసాద్, జెమిని ప్రసాద్, మణిచందన, హరి తేజ, మౌళిక, మిధున

సాంకేతిక వర్గం
మ్యూజిక్ – జిబ్రాన్
లిరిక్స్ – రామ జోగయ్య శాస్త్రి, రెహమాన్
సినిమాటోగ్రఫి – సర్వేష్ మురారి
ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వర రావ్
ఫైట్ మాస్టర్ – వెంకట్
డైలాగ్స్ – చంద్ర మోహన్ చింతాడ
ఆర్ట్ – ఎ.ఎస్.ప్రకాష్
కొరియో గ్రఫి – భాను మాస్టర్
పబ్లిసిటీ – ధని
పిఆర్ఓ – ఏలూరు శ్రీను,
బ్యానర్ – యునైటెడ్ కిరీటి మూవీస్ లిమిడెట్
ప్రొడ్యూసర్ – పరుచూరి కిరీటి
డైరెక్టర్ – కె. క్రాంతి మాధవ్

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
జూన్ 22న ప్ర‌పంచ వ్యాప్తంగా `టిక్ టిక్ టిక్‌` గ్రాండ్ రిలీజ్‌
జ‌యం ర‌వి, నివేదా పేతురాజ్ హీరో హీరోయిన్లుగా చ‌ద‌ల‌వాడ బ్ర‌ద‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో  శ్రీ తిరుమ‌ల తిరుప‌తి వెంక‌టేశ్వ‌ర ఫిలింస్ బ్యాన‌ర్‌పై శ‌క్తి స...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts