వాళ్లంద‌రి క‌న్నా నాకే ఎక్కువ పేరొస్తుంద‌నుకుంటున్నా: సుధీర్ బాబు

0
నారారోహిత్‌, సుధీర్‌బాబు, సందీప్‌కిషన్‌, ఆది హీరోలుగా నటించిన చిత్రం ‘శమంతక మణి’. శ్రీరామ్‌ ఆదిత్య దర్శకుడు. వి.ఆనంద్‌ ప్రసాద్‌ నిర్మాత. ఈ సినిమా జులై 14న విడుదలవుతుంది. ఈ సందర్భంగా హీరో సుధీర్‌బాబు మీడియాతో సినిమా గురించిన సంగతులను తెలియజేశారు.
సుధీర్‌బాబు మాట్లాడుతూ ,  ` కొన్ని సినిమాలు ఆడియెన్స్‌తో పాటు మనకు కూడా నచ్చి, బావుంటుందని చేస్తాం. అలాంటి వాటిలో ‘శమంతకమణి’ ఒకటి. ఈ సినిమాలో తల్లి లేని యువకుడి పాత్రలో నటించాను. ఇది యాక్షన్‌ సినిమా కాదు. నా పాత్ర కామెడి చేయకున్నా, నా పాత్ర చుట్టు ఉండే పాత్రల వల్ల కామెడి పుడుతుంది. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర నా నిజ జీవితానికి దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ చిన్న వయసులో ఉండగానే మా అమ్మమ్మగారు చనిపోయారు. మా అమ్మగారేమో తల్లి ప్రేమ ఏంటనేది తెలియకుండా పెరిగారట. మా అమ్మగారు నన్నెంతో గారాబంగా పెంచారు. మా అమ్మ నన్నెంత బాగా పెంచారనే ఆలోచించాను. కానీ మా అమ్మ ఎంత ప్రేమగా పెరిగిందనే ఆలోచనే రాలేదు. ఈ సినిమాలో నేను చేసిన పాత్ర వల్ల నేను అది ఫీల్‌ అయ్యాను. మా అమ్మను నాకే పరిచయం చేసిన క్యారెక్టర్ ఇది.  వాస్త‌వానికి ఈ క‌థ‌ను ఓ నిజ ఘటనను ఆధారంగా చేసుకుని తయారు చేశాడు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. ఇదొక థ్రిల్లర్‌. డిఫరెంట్‌గా నడుస్తుంది. ఎమోషనల్‌ పార్ట్‌ నా వైపు నుండి నడుస్తుంటుంది. ఇందులో ప్రతి పాత్రకు సమాన ప్రాధాన్యత ఉంది. నాలుగు క్యారెక్టర్స్‌లో నేను ఏ పాత్ర చేయాలనేదాన్ని దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్యనే నిర్ణయించారు. వాళ్లంద‌రికంటే ఎక్కువ‌గా ఎవ‌రి కి పేరు వ‌స్తుందంటే నాకే అని అంటాను( న‌వ్వుతూ).  నన్ను ఎగ్జయిట్‌ చేసే పాత్రలు వస్తే విలన్‌గా అయినా నటిస్తాను. అలాగే మహేష్‌ సినిమాలో కూడా నటించడానికి నేను సిద్ధమే. శ్రీరామ్‌ ఆదిత్య చాలా టాలెంటెడ్‌. దర్శకత్వంలో ఏ అనుభవం లేకుండా నాతో ‘భలేమంచిరోజు’ అనే సినిమా చేశాడు. అదే నమ్మకంతోనే హీరోలందరూ ఈ సినిమా చేశారు. సక్సెస్‌లో కూడా తన తప్పులేంటో వెతుక్కుంటూ ఉంటాడు దర్శకుడు శ్రీరామ్‌ ఆదిత్య. భవిష్యత్‌లో తెలుగు సినిమా గర్వపడే సినిమాలు చేస్తాడని అనుకుంటున్నాను` అని అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts