`శ్రీక‌రం శుభ‌క‌రం  నారాయ‌ణీయం` చిత్రం లోగో ఆవిష్క‌ర‌ణ‌

0
గోదాద్రి క్రియేష‌న్స్ ప‌తాకంపై వాన‌మామ‌లై కృష్ణ దేవ్ స్వీయాద‌ర్శ‌క‌త్వంలో నిర్మిస్తోన్న చిత్రం `శ్రీక‌రం శుభ‌క‌రం నారాయ‌ణీయం`. నిమ్మాని ప్ర‌శాంత్, ఐన్ థ్రిల్లా చ‌క్ర‌వ‌ర్తి హీరో, హీరోయిన్ల‌గా న‌టిస్తున్నారు. ఈ సినిమా లోగో ఆవిష్క‌ర‌ణ కార్య‌క్ర‌మం బుధ‌వారం ఉద‌యం హైద‌రాబాద్ లో జ‌రిగింది. నిర్మాత తుమ్మ‌లప‌ల్లి రామస్య‌నారాయ‌ణ‌, బెక్కం వేణుగోపాల్ లోగో ఆవిష్క‌రించారు.
అనంత‌రం చిత్ర  ద‌ర్శ‌క‌, నిర్మాత  వాన‌మామ‌లై కృష్ణ దేవ్  మాట్లాడుతూ, `  ప్ర‌స్తుతం పాశ్చాత్య ప్ర‌భావిత యువ‌త‌ను భార‌తీయ స‌నాత‌న స‌మాజానికి దూరం కాకుండా, అవ‌స‌ర‌మైన ఆనంద అహ్లాదాల‌తో కూడుకుని ప్ర‌గ‌తి మార్గంలో విజ‌యం పొందేందుకు దైనందిన జీవితంలో దైవ‌రాధ‌న‌తో ప్రారంభించి ఆధ్యాత్మిక చింత‌న‌ను అల‌వ‌ర‌చుకునే విధంగా తీర్చిద్దుతాం. సాంప్ర‌దాయ కుటుంబ యువ‌తి, అలాగే దీనికి ప్ర‌భావితం అయిన‌టువంటి సామాన్య యువ‌కుని విజ‌య ప‌రంపర ఈ చిత్రానికి మూల క‌థ‌. ద‌ర్శ‌క‌, నిర్మాత‌గా ఇదినా తొలి ప్ర‌య‌త్నాన్ని అంతా ఆద‌రిస్తార‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.
హీరో నిమ్మాని ప్ర‌శాంత్ మాట్లాడుతూ, ` హీరోగా నాకిది తొలి సినిమా. ఇది ట్రెడిష‌న‌ల్ సినిమానే కాదు. స‌మాజహితాన్నికోరే విష‌యాలు కూడా ఉన్నాయి. మంచి క‌థాంశం. అంద‌రికీ న‌చ్చ‌తుంద‌ని ఆశిస్తున్నా` అని అన్నారు.
హీరోయిన్ ఐన్ థ్రిల్లా చ‌క్ర‌వ‌ర్తి మాట్లాడుతూ, ` నా మాతృభాష బెంగాలీ. మ‌ణిపురి నృత్యం బాగా తెలుసు. కూచిపూడిలో కూడా అనుభ‌వం ఉంది. ఈ రెండు ఈ క‌థ‌కు బాగా ఉప‌యుక్తం అయ్యాయి` అని అన్నారు.
ఈ కార్యక్ర‌మంలో స‌హ ద‌ర్శ‌కులు ప‌నుమూరి ర‌మేష్‌, ఛాయాగ్రాహ‌కుడు రాం శ్రీనివాస్, సంగీత ద‌ర్శ‌కుడు తార‌క రామారావు పాల్గొన్నారు. ఈ చిత్రానికి క‌థ‌, క‌థ‌నం, నిర్మాత‌, ద‌ర్శ‌క‌త్వం:  వాన‌మ‌లై కృష్ణ‌దేవ్
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

'4 ఇడియట్స్‌' ప్రారంభం
కార్తి, సందీప్‌, చలం, సన్ని హీరోలుగా ప్రియ అగస్టిల్‌, చైత్ర, రుచిర, శశి హీరోయిన్లుగా నాగార్జున సినీ క్రియేషన్స్‌ బ్యానర్‌పై శ్రీరంగం సతీశ్‌ కుమార...
ఫ్యామిలీ ఎమోష‌న్స్ ఉన్న సినిమా ఇది: హీరో నితిన్!
నితిన్, మేఘా ఆకాశ్ హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘ఛల్ మోహన్‌రంగ’. ఈ సినిమా ఏప్రిల్ 5న విడుదలవుతుంది. మార్చి 30న హీరో నితిన్ పుట్టినరోజు. ఈ సంద...
నాని, నాగ్ ల‌ మల్టీస్టారర్‌ పాటల రికార్డింగ్‌ ప్రారంభం
కింగ్‌ నాగార్జున, నేచురల్‌ స్టార్‌ నాని హీరోలుగా వైజయంతి మూవీస్‌ పతాకంపై టి.శ్రీరామ్‌ ఆదిత్య దర్శకత్వంలో అగ్ర నిర్మాత సి.అశ్వనీదత్‌ నిర్మిస్తున్న...
powered by RelatedPosts