ఎన్టీఆర్ కోసం కథ రాస్తున్న శ్రీకాంత్ ?

0

Director Srikanth Addala at SVSC Shooting Spot Stillsశ్రీకాంత్ అన్నాం కదా అని హీరో శ్రీకాంత్ అనుకునేరు… కానే కాదు. “కొత్తబంగారు లోకం”, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’కుటుంబ బాంధవ్యాలకు పెద్ద పీట వేసే సినిమాలను తీసి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన డైరెక్టర్ శ్రీ కాంత్ అడ్డాల గురించి మనం చెప్పుకోబొతున్నాం. శ్రీ కాంత్ అడ్డాల ప్రస్తుతం నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ని హీరోగా పరిచయం చేస్తూ ‘ముకుందా’ అనే సినిమా చేస్తున్నాడు. గోదావరి బ్యాక్ డ్రాప్ లో సాగే పల్లెటూరి కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.

ఈ సినిమా చివరి దశలో ఉండగానే శ్రీ కాంత్ అడ్డాల తన తదుపరి సినిమా కోసం సిద్దమవుతున్నాడు. తన తదుపరి సినిమా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ తో ప్లాన్ చేస్తున్నాడు. విశ్వసనీయ వర్గాల కథనం ప్రకారం ఇప్పటికే ఎన్.టి.ఆర్ – శ్రీకాంత్ అడ్డాల మధ్య కథా చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎన్.టి.ఆర్ పూరి జగన్నాధ్ సినిమా తర్వాత ఈ సినిమా సెట్స్ పైకి వెళ్ళే అవకాశం ఉంది.

మాస్ ఇమేజ్ ఉన్న ఎన్టీఆర్- ఫ్యామిలీ కథా చిత్రాలు తీసే శ్రీకాంత్ అడ్డాల కలయికలో ఎలాంటి సినిమా రాబోతోంది… ఎన్టీఆర్ అని శ్రీకాంత్ ఎలా చూపించబోతున్నాడు అని అప్పుడే ఫ్యాన్స్ లో ఒక రకమైన ఆత్రుత మొదలైంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts