శ్ర‌ద్ధాకపూర్ ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది!

0
మ‌న స్టార్ హీరోల్లో మ‌గువ‌ల గుండెల్లో మారాజాగా వెలిగిపోతున్న డార్లింగ్ హీరో ఎవ‌రో చెప్ప‌గ‌ల‌రా?  .. లిప్త పాటు కాలంలో  ప్ర‌భాస్ అంటూ ఈజీగానే చెప్పేస్తారులెండి! ఆరున్న‌ర అడుగుల ఆజానుబాహుడు, మెలితిరిగిన దేహ‌శిరులు క‌ల‌వాడు.. క్రీగంటి చూపుతో సైడు కోసేసేవాడు .. ఇంకెవ‌డు?… ఒక్క ప్ర‌భాస్ త‌ప్ప‌. అందుకే అత‌డి ప‌రిచ‌యం కోసం సామాజిక మాధ్య‌మాల్లో వెతికే గాళ్స్ ఎక్కువే. అయితే ప్ర‌భాస్ చిక్క‌డు దొర‌క‌డు టైపు. మోస్ట్ వాంటెడ్ ఎలిజిబుల్‌ బ్యాచిల‌ర్ కూడా. `బాహుబ‌లి` సిరీస్ త‌ర్వాత అస‌లే దొరికేట్టు లేడు. నిరంత‌రం సినిమా గురించే త‌పిస్తూ కెరీర్‌ని రాకెట్ స్పీడ్‌తో ప‌రుగులు పెట్టించ‌డ‌మే ప‌నిగా పెట్టుకున్నాడు. జాతీయ స్థాయి మార్కెట్‌ని కొల్ల‌గొట్ట‌డ‌మే ధ్యేయంగా అహోరాత్రులు శ్ర‌మిస్తున్నాడు. అందువ‌ల్ల ఎవ‌రికీ చిక్క‌డు.. దొర‌క‌డు!
ప్ర‌స్తుతం `సాహో` చిత్రీక‌ర‌ణ కోసం ప‌క్కాగా ప్రిపేరై క‌థ‌న‌రంగంలోకి దూకేస్తున్నాడు. వీరాధివీరుడు బాహుబలుడు న‌టిస్తున్న హై ఆక్టేన్ సోషియో యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ ఇది. బిల్డింగుల‌పైనుంచి బిల్డింగుల‌పైకి హాలీవుడ్ హీరోలు దూకడ‌మే చూశాం ఇదివ‌ర‌కూ. ఈసారి మ‌న డార్లింగ్‌ని చూడ‌బోతున్నాం. భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు.. అంత‌కుమించి మిరుమిట్లు గొలిపే వీఎఫ్ఎక్స్ ఈ సినిమాని టాప్ క్లాస్‌లో నిల‌బెట్ట‌నున్నాయి. అందుకే ఇంత‌టి క్లాస్ సినిమాకి ఉత్త‌రాది నుంచి క్లాస్ హీరోయిన్‌నే వెత‌కాల‌ని యువ‌త‌రం నాయిక‌ శ్ర‌ద్ధాక‌పూర్‌ని ఏరి కోరి తెచ్చుకున్నారు. భారీ పారితోషికం డిమాండ్ చేసినా ఎట్ట‌కేల‌కు శ్ర‌ద్ధా నుంచి గ్రీన్ సిగ్న‌ల్ వ‌చ్చింది. అంతేకాదు బాహుబ‌లుడి స‌ర‌స‌న అవ‌కాశం అంటే శ్రద్ధా సైతం అంతే ఉబ్బిత‌బ్బిబ్బ‌వుతోంది. “సాహో టీమ్‌తో క‌ల‌వ‌డం .. ప్ర‌భాస్‌తో ప‌ని చేయ‌డం అంటే..సో ఎగ్జ‌యిటెడ్?“ అంటూ శ్ర‌ద్ధా చాలానే ఎగ్జ‌యిటైపోయింది.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts