ఆమెతో పాటు ఈమె కూడా పూసుకుంటుందట

0

priynka-sonkashiఎవరితో పాటు ఎవరు ఏం పూసుకుంటారు?అనే కదా మీ సందేహం? అబ్బే…. మరేం లేదండీ…!! ప్రముఖ హెయిర్ ఆయిల్ కంపెనీ అయిన డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ప్రచారకర్తల జాబితాలో ఇప్పుడో కొత్త తార చేరింది. అస్తుతం ప్రియాంకా చోప్రా డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ కి ప్రచారం చేస్తుండగా.. ఆమెతో పాటు సోనాక్షి సిన్హాను కూడా కో-బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తూ డాబర్ సంస్థ నిర్ణయం తీసుకుంది. బాలీవుడ్ లో ఒకే సమయంలో అగ్రస్థానంలో ఉన్న ఇద్దరు హీరోయిన్లు ఒకే ఉత్పత్తికి ప్రచారం చేయడం ఇదే మొట్టమొదటిసారి. అందులోనూ డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ విషయంలో ఇలా జరగడం అయితే దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి అవుతుంది.

ఈనాటి మహిళల అవసరాలు తీర్చడానికి డాబర్ ఆమ్లా హెయిర్ ఆయిల్ ఒక ఫేస్ లిఫ్ట్ తయారుచేసిందని, దాంతో తమ బ్రాండు మరింత యూత్ ఫుల్ గా తయారవుతుందని వ్యక్తిగత సంరక్షణ ఉత్పత్తుల విభాగం ఆమర్కెటింగ్ హెడ్ ప్రవీణ్ జైపూరియర్ తెలిపారు. ఈ కొత్త గుర్తింపుతో తమ బ్రాండు ఈరోజు జీవనశైలికి అనుగుణంగా ఉంటుందని ఆయన చెప్పారు. ఈ ఇద్దరు తారలతో కూడిన ప్రచార వీడియో త్వరలోనే విడుదల అవుతుందన్నారు.

అయితే, ప్రియాంక- సొనాక్షి కలిసి ఒకే ప్రచార చిత్రంలో నటిస్తారా లేక, డాబర్ కంపెనీ సొనాక్షితో విడిగా మరో యాడ్ ఏమైనా తయారు చేస్తుందా అన్నదాని మీద ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts