‘సత్యమూర్తి’ కలెక్షన్స్ ?

0

Son Of Satyamurthy New Photos (4)అల్లు అర్జున్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో హా ‘సన్నాఫ్ సత్యమూర్తి’ మొన్న గురువారం( ఏప్రిల్ 9న)ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదలైంది.మార్నింగ్ షో నుంచి డివైడ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రం కలెక్షన్స్ లో మాత్రం రేసు గుర్రం లా పరుగెడుతోందని ట్రేడ్ వర్గాల సమాచారం. మొదటి రోజే తెలుగు రాష్ట్రాల్లో తొమ్మిది కోట్లకి పైగా షేర్ సాధించిన ఈ చిత్రం రెండో రోజు కూడా అదరకొట్టింది. ఇదే జోరు నిన్న(శనివారం),ఈ రోజు(ఆదివారం) కొనసాగుతోంది. చాలా చోట్ల ఇప్పటికి బ్లాక్ లో టిక్కెట్లు కొనుక్కునే పరిస్ధితి కనపడుతోందని చెప్పుతున్నారు. ఇదే కొనసాగితే వీకెండ్ అయ్యేలోగా..ఈ చిత్రం మన రాష్ట్రాల్లోనే పాతిక కోట్లు మార్కు ని చేరుకునే అవకాసం ఉందని అంటున్నారు. ఆ తర్వాత స్టడీగా కలెక్షన్స్ ఉంటే పూర్తి సేఫ్ అయినట్లే,లాభాలు కూడా వచ్చే అవకాసం ఉందని అని చెప్తున్నారు. టాక్ తేడాగా ఉండటంతో కలెక్షన్స్ పై ప్రభావం చూపెడుతుందని భయపడ్డ బయ్యర్లు..రిలీఫ్ ఫీలవుతున్నారు. అల్లు అర్జున్ సినిమా అంటేనే అంచనాలు పెరిగిపోతాయి. అలాంటిది కుటుంబ ప్రేక్షకులను తనదైన సెంటిమెంట్, భావోద్వేగాలు, ఫన్ తో ఆకట్టుకునే త్రివిక్రమ్ జత కలిస్తే ఇంకేముంది. జులాయి ని మించిపోతుంది. ఇప్పుడు అందరి అంచనా ఇదే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చంద్ర‌శేఖ‌ర్ ఏలేటి తో యంగ్ టైగ‌ర్ మూవీ!
టాలీవుడ్ లో వైవిధ్య‌మైన చిత్రాల‌ను తెర‌కెక్కిస్తూ త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు చంద్ర శేఖ‌ర్ ఏలేటి. ఆయ‌న క‌థ‌లు చాలా ఇన్నో...
వ‌డివేలు వెయిట్ త‌గ్గాడు
త‌మిళ హాస్య నటుడు వడివేలు ప్రధానపాత్ర పోషిస్తున్న చారిత్రాత్మక చిత్రం ‘ఇంసై అరసన్‌ 23 ఆమ్‌ పులికేసి- 2’ కోసం తన శరీర బరువు తగ్గించుకున్నారు. ఇద...
అల్లుడితో భాయ్ ఆట‌లు
బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ ఖాన్‌ పక్కా ఫ్యామిలీ మ్యాన్‌. షూటింగ్‌లో ఏ మాత్రం గ్యాప్‌ వచ్చినా తన కుటుంబ సభ్యులతో గడిపేందుకే ఆయన సమయాన్ని కేటాయి...
powered by RelatedPosts