నిడారంబ‌రంగా మా` అధ్య‌క్షుడు ` శివాజీ రాజా పుట్టిన‌రోజు వేడుక‌లు

0

`మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా పుట్టిన రోజు వేడుక‌లు సోమ‌వారం ఉదయం `మా` కార్యాల‌యంలో నిడారంబ‌రంగా జ‌రిగాయి. `మా` కార్య‌వ‌ర్గ స‌భ్యులు..ప‌లువురు ఆర్టిస్టులు కేక్ క‌ట్ చేసి శివాజీ రాజాకు తినిపించి శుభాకాంక్ష‌లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా `మా` కోసం పాటుప‌డుతోన్న శివాజీ రాజా నిరంత‌ర కృషిని కొనియాడారు.

ఈ వేడుక‌ల్లో సీనియ‌ర్ ద‌ర్శ‌కులు ఎస్. వి. కృష్ణారెడ్డి, `మా` ఎగ్జిక్యుటివ్ వైస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్, వైస్ ప్రెసిడెంట్ బెన‌ర్జీ, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ నరేష్‌, జాయింట్ సెక్ర‌ట‌రీ ఏడిద శ్రీరామ్, క‌ల్చ‌ర‌ల్ క‌మిటీ చైర్మ‌న్ సురేష్ కొండేటి, కార్య వ‌ర్గ స‌భ్యులు సురేష్‌, గీతాసింగ్, వెంక‌ట గోవింద‌రావు త‌దిత‌రులు పాల్గొన్నారు.

అలాగే ప్ర‌తీ ఏడాది శివాజీ రాజా పుట్టిన రోజు సంద‌ర్భంగా బ‌స‌వ‌తార‌కం క్యాన్సర్ ఆసుప‌త్రిలో రోగుల‌కు ప‌ళ్లు పంచుతుంటారు. ఈ ఏడాది కూడా త‌న బ‌ర్త్డ డే సంద‌ర్భంగా య‌ధావిధిగా ప‌ళ్లు పంచ‌డం జ‌రిగింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

విజయనిర్మల జన్మదిన వేడుకలు... `మా` కు 73 వేలు స‌హాయం!
సీనియర్ నటీమణి, దర్శకురాలు, నిర్మాత, గిన్నీస్ బుక్ రికార్డ్ హోల్డర్ విజయనిర్మల గారు నేడు తన 73వ జన్మదిన వేడుకలను ఘట్టమనేని వంశాభిమానుల సమక్షంలో ఘ...
ఏప్రిల్ 28న మెగాస్టార్ చిరంజీవి అతిధిగా అమెరికాలో మా తొలి ఈవెంట్!
`మా` (మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్) 25 వ‌సంతాలు పూర్తిచేసుకున్న సంద‌ర్భంగా సిల్వ‌ర్ జూబ్లీ వేడుక‌లు ఘ‌నంగా నిర్వ‌హిస్తోన్న సంగ‌తి తెలిసిందే. దీనిలో...
సైబ‌ర్ క్రైమ్ సీఐడీ రామ్మోహ‌న‌రావుకు `మా` నాట‌కోత్స‌వాల‌ ఆహ్వానం!
యు.రామ్మోహ‌నరావు ( సూప‌రిడెంట్ ఆఫ్ పోలీస్, సైబ‌ర్ క్రైమ్ సి.ఐడీ, హైద‌రాబాద్) లైఫ్ టైమ్ అచీవ్ మెంట్ అవార్డు అందుకున్న సంద‌ర్భంగా `మా` మూవీ ఆర్టిస్...
powered by RelatedPosts