`సినీ మ్యుజీషియ‌న్స్ యూనియ‌న్` కు అధ్య‌క్షురాలిగా ఎన్నికైన  `సింగింగ్ స్టార్` విజ‌య‌ల‌క్ష్మి

0

తెలుగు చ‌ల‌న‌చిత్ర సంగీత ప‌రిశ్ర‌మ‌కు చెందిన నేప‌థ్య గాయ‌నీ గాయ‌కులు, సంగీత ద‌ర్శ‌కులు, వాయిద్య‌కారులు స‌భ్యులుగా ఉండే సంస్థ `సినీ మ్యుజీషియ‌న్స్ యూనియ‌న్` ( సిఎంయు). ఈ ప్ర‌తిష్టాత్మ‌క‌మైన యూనియ‌న్ కి  నిన్న (మంగ‌ళ‌వారం)  జ‌రిగిన కార్య‌వ‌ర్గ ఎన్నిక‌ల్లో  అధ్య‌క్షురాలిగా ప్ర‌ముఖ నేప‌థ్య గాయ‌ని `సింగింగ్ స్టార్`  విజ‌యల‌క్ష్మి ఎన్నిక‌య్యారు. గౌర‌వ అధ్య‌క్షులుగా శ్రీ ఆర్. పి ప‌ట్నాయ‌క్, అడ్వైజ‌రీ బోర్డు చైర్మ‌న్ గా శ్రీ మ‌ణిశ‌ర్మ‌, ఉపాధ్య‌క్షులుగా  శ్రీ పాల్ రాజ్, ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా శ్రీ ఆలీన‌స్, సంయుక్త కార్య ద‌ర్శిగా గాయ‌ని కౌస‌ల్య‌, కోశాధికారిగా గాయ‌కుడు ర‌మ‌ణ‌, సల‌హాదారుగా శ్రీ రామాచారి ఎన్నిక‌య్యారు.
ఈ సంద‌ర్భంగా అధ్య‌క్షురాలిగా ఎన్నికైన గాయ‌ని విజ‌య‌ల‌క్ష్మి మాట్లాడుతూ,-` నేప‌థ్య గాయ‌నిగా వివిధ చిత్రాల్లో 300కు పైగా పాట‌లు పాడి, చ‌ల‌న చిత్ర సంగీత రంగంతో సుధీర్ఘ అనుభ‌వం ఉన్న నాకు, అదే శాఖ‌కు సంబంధించిన ప్ర‌తిష్టాత్మ‌క యూనియ‌న్ కు  అధ్య‌క్షురాలిగా ఎంపిక కావ‌డం చెప్ప‌లేని సంతోషాన్ని క‌లిగిస్తోంది.  ఒక మ‌హిళ ఈ యూనియ‌న్ కు అధ్య‌క్ష‌త వ‌హించ‌గ‌డం ఇదే ప్ర‌థ‌మం. స‌భ్యులు నాపై పెట్టుకున్న న‌మ్మ‌కాన్ని వంద‌శాతం నిల‌బెట్టుకోవాడినికి ప్ర‌య‌త్నిస్తాను. పేద‌, వృద్ధ కళాకారుల‌కి స‌హాయ‌ప‌డేలా ఓ మూల నిధిని ఏర్పాటు చేయ‌డం, క‌ళాకారులంద‌రికీ ఆరోగ్య భీమా కార్డులు, ఇళ్ల స్థ‌లాలు వ‌చ్చేలా చేయ‌డం, స్థానిక క‌ళాకారుల‌కి ఎక్కువ ప‌ని దొరికేలా చేయ‌డం నా ముందున్న ల‌క్ష్యాలు. ఇవి కార్య‌రూపం దాల్చ‌డానికి మేము శ‌క్తివంచ‌న లేకుండా కృషి చేస్తాం“ అని అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Vijayalakshmi coming back to Chennai 28 - II
The first look poster of the Chennai 28 sequel film has earned good response from everyone. Director Venkat Prabhu has already started workin...
`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
powered by RelatedPosts