శ‌మంత‌క‌మ‌ణి` రివ్యూ

0
2.5 Awesome
  • MAA Stars Rating 2.5
  • User Ratings (0 Votes)
    0

Shamanthkamani

చిత్రం పేరు: శమంతకమణి
నటీనటులు: నారా రోహిత్‌.. సుధీర్‌బాబు.. సందీప్‌కిషన్‌.. ఆది.. రాజేంద్రప్రసాద్‌.. సుమన్‌.. ఇంద్రజ.. చాందినీ చౌదరి.. అనన్య సోని.. జెన్నీ హనీ
సంగీతం: మణిశర్మ
ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
నిర్మాత: వి.ఆనంద్‌ ప్రసాద్‌
దర్శకత్వం: శ్రీరామ్‌ ఆదిత్య
నిర్మాణ సంస్థ: భవ్య క్రియేషన్స్‌
మాస్టార్స్.రేటింగ్:2.5/5

ముందుమాట‌:
స్టార్ ఇమేజ్ ను ప‌క్క‌న‌పెట్టి సినిమాలు చేయ‌డానికి యంగ్ హీరోల నుంచి స్టార్ హీరోల వ‌ర‌కూ అంతా ముందుకొస్తున్నారు. ఇప్పుడిప్పుడే ఇమేజ్ చ‌ట్రం అనే మాట‌ను కూడా టాలీవుడ్ నెమ్మ‌దిగా దూరం చేస్తుంది. క‌థ ప‌క్కాగా ఉంటే కాంబినేష‌న్ అటోమేటిక్ గా కుదురుతుందని ఇప్ప‌టికే ప‌వ‌న్ క‌ల్యాణ్‌, వెంక‌టేష్ ( గోపాల గోపాల‌) వంటి స్టార్లు ప్రూవ్ చేశారు. తాజాగా యంగ్ హీరోలు నారా రోహిత్, ఆది, సందీప్ కిష‌న్, సుదీర్ బాబు ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన‌ `శ‌మంత‌కమ‌ణి` కూడా అలా కుదిరిందే. కాగా ఆ మూవీ నేడు ప్రేక్ష‌కులు ముందుకు వ‌చ్చింది. ఆ సినిమా క‌థా క‌మామీషు ఏంటో ఓసారి చూద్దాం.

క‌థ‌:
శ‌మంత‌క‌మ‌ణి రోల్స్ రాయ‌ల్స్ (కారు) అత్యంత ఖరీదైన రాజుల కాలం నాటిది. కృష్ణ (సుధీర్ బాబు) చిన్న‌ప్పుడే ఆ కారును ఇష్ట‌ప‌డ‌తాడు. కానీ త‌ల్లి మ‌ర‌ణంతో కృష్ణ జీవిత‌మే వేరుగా ఉంటుంది. స‌వ‌తి త‌ల్లి ప‌ట్టించుకోదు..తండ్రి జ‌గ‌న్నాథ్ (సుమ‌న్) డ‌బ్బు పిచ్చితో ప‌ట్టించుకోడు. అయితే జ‌గ‌న్నాథ్ కు పాత కార్ల‌ను క‌ల‌క్ష‌న్ చేయ‌డం హాబీ. అలా శ‌మంత‌క‌మ‌ణి ని వేలంలో 5 కోట్ల‌కు పాడ‌తాడు. తంల్లిదండ్రుల‌కు తెలియ‌కుండా ఓ రోజు కృష్ణ శ‌మంత‌క‌మ‌ణి లో ప్రోవెటాల్ ( హాట‌ల్ క‌మ్ ప‌బ్) కు వెళ్తాడు. అనుకోకుండా అక్క‌డే ఆ కారు మిస్ అవుతుంది. మ‌రి ఆ శ‌మంత‌క‌మ‌ణిని ఎవ‌రు దొంగిలించారు? ఆ కారుకి భిన్న వ్య‌క్తిత్వాలు గ‌ల‌ కార్తిక్ ( ఆది), రంజిత్ కుమార్ ( నారా రోహిత్), శివ (సందీప్ కిష‌న్), ఉమా మ‌హేశ్వ‌ర‌రావు ( రాజేంద్ర ప్ర‌సాద్) ల‌కి ఉన్న సంబంధం ఏంటి? ఆ కారులో ఉన్న అస‌లు విష‌యం ఏంటి? జ‌గ‌న్నాథ్ ఆ కారు కోసం ఎందుకు అంత‌గా తాప‌త్ర‌ప‌య‌ప‌డ‌తాడు? అనే అంశాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎనాల‌సిస్:
కారు మిస్ అయింద‌నే పాయింట్ ను సింపుల్ గానే తీసుకుంటాం. ఏ ముందు ఆ సినిమా లో న‌లుగురు హీరోలున్నారు.. క‌థ స్టార్టింగ్ లో కారు మిస్ అవుతుంది..క్లైమాక్స్ లో ఆ కారుని క‌నిపెడ‌తారు. ఈ క‌థ‌కు మ‌సాలా, హాస్యం స‌మ‌పాళ్ల‌లో ద‌ట్టించి క‌మ‌ర్శిలైజ్ చేసి సినిమా తీసి ఉంటార‌ని భావిస్తాం. ఈ మాట సినిమా చూడ‌క ముందు కామ‌న్ జ‌నాలు సైతం కామ‌న్ గా మాట్లాడుకునేదే. కానీ శ‌మంత‌క‌మ‌ణిని చూస్తే త‌ప్ప‌నే భావ‌న క‌ల్గుతుంది. వాస్త‌వంగా జ‌రిగిన కారు మిస్సింగ్ పాయింట్ తోనే క‌థ‌, క‌థ‌నాల‌ను ద‌ర్శ‌కుడు చ‌క్క‌గా రాసుకున్నాడు. ఈ క‌థ‌లో ఒక్కో పాత్ర‌ది ఒక్కో స్వ‌భావం. క‌థ‌లో డ్రామా ఉంది. తల్లిదండ్రులున్నా లేన‌ట్లేన‌ని ఫీల‌య్యే కృష్ణ పాత్ర‌ను అద్భుతంగా డిజైన్ చేశాడు. కోట్లాది రూపాయ‌లు ఆస్తి ఉన్నా..అనుభ‌వించ‌లేని కొడుకు… కొడుకంటే గిట్ట‌ని స‌వ‌తి త‌ల్లి… డ‌బ్బంటే ప‌డి చ‌చ్చే తండ్రి పాత్ర‌ల స్వ‌భావాలు బాగా క్యారీ అయ్యాయి. ప్రేమించిన అమ్మాయి ద‌క్క‌లేద‌ని కోపంతో ఏదో ఒక‌టి చేసే శివ.. హైఫై లైప్ ఉంటేనే అమ్మాయిలు వెంట ప‌డ‌తార‌ని కార్తీక్ వాళ్ల వ్య‌క్తిత్వాలు గురించి త‌లుచుకుంటూ మ‌ద‌న ప‌డ‌టం..కరెప్టెడ్ పోలీస్ ఆఫీస‌ర్ రంజిత్ కుమార్ కారు గురించి సాగించే అన్వేష‌ణ‌.. భానుమ‌తి ( ఇంద్ర‌జ‌) ప్రేమ‌కోసం ఉమామ‌హేశ్వ‌ర‌రావు ప‌డే పాట్లు..అన్నీ పాత్ర‌ల స్వ‌భావాల్లో నాట‌కీయ‌త‌..తెలియ‌ని భావోద్వేగాలున్నాయి. ఒకానోక స‌మ‌యంలో క్యారెక్ట‌ర్ల‌ను బేస్ చేసుకునే క‌థ‌ను రాసుకున్న‌ట్లు అనిపించింది. వీటిని ఒక్కొక్క‌టిగా ప‌రిచ‌యం చేయ‌డంతోనే ప్ర‌ధ‌మార్థం ముగుస్తుంది. క‌థ‌నాన్ని ఆస‌క్తిక‌రంగా మ‌లుస్తూ క్యారెక్ట‌ర్ల‌ను రివీల్ చేయ‌డంతో ఎక్క‌డా ఎలాంటి క‌న్ఫ్యూజ‌న్స్ క‌ల‌గ‌లేదు. టైమింగ్ కామెడీ బాగా కూడా వ‌ర్కౌట్ అయింది. అయితే కొన్ని కొన్నిహాస్య స‌న్నివేశాలు అంత‌గా అందిన‌ట్లు అనిపించ‌లేదు. ద్వితియార్థంలో క‌థ వేగం పుంజుకుంది. ఇక్క‌డి నుంచే ట్విస్టులు కూడా మొద‌ల‌వుతాయి. ఊహించ‌ని ట్విస్టుల‌తో క‌థ‌నాన్నిమ‌రింత‌ ఆస‌క్తిక‌రంగా న‌డిపించాడు. క్లైమాక్స్ కూడా ఆడియ‌న్స్ ఊహించ‌ని విధంగా ముగించాడు. జ‌గ‌న్నాథం ని క్లైమాక్స్ లో మ‌రోసారి రివీల్ చేసి అత‌నికి కావాల్సింది శ‌మంత‌క‌మ‌ణ‌? లేక అంత‌కు మించి ఇంకేమైనా విలువైన‌వి అందులో ఉన్నాయా? అని ఆడియ‌న్స్ ను కాస్త కంగారు పెట్టాడు. ఓవ‌రాల్ గా ఈ క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్ ట్విస్టుల థ్రిల్ల‌ర్ అనిపించింది.

న‌టీన‌టులు: నారా రోహిత్‌.. సుధీర్‌బాబు.. సందీప్‌కిషన్‌.. ఆది.. రాజేంద్రప్రసాద్‌ పాత్రలు స‌మ‌నంగా సాగుతాయి. ఎవ‌రు ఎక్కువ‌? త‌క్కువ‌? అనేది ఎక్క‌డా లేదు. అయితే సుధీర్ బాబు పాత్ర‌లో ఎమోష‌న్ బాగా వ‌ర్కౌట్ అయింది. అలాంటి జీవితం అనుభ‌వించే వారికి ఆ పాత్ర బాగా క‌నెక్ట్ అవుతుంది. త‌ర్వాత నారా రోహిత్ పాత్ర కొంచెం కీల‌కంగా అనిపిస్తుంది. మిగ‌తా పాత్ర‌లు త‌మ ఫ‌ర‌ది మేర న‌టించారు.

సాంకేతిక వ‌ర్గం: పాత క‌థే అయినా చెప్పిన విధానం బాగుంది. అలాగే ట్రీట్ మెంట్ కొత్త‌గా అనిపించింది. శ్రీరామ్ ఆదిత్య డెబ్యూ అయినా సినిమా చూస్తున్నంత సేపు ఆ ఫీల్ ఎక్క‌డా క‌ల్గ‌లేదు. స‌మీర్‌రెడ్డి కెమేరా పనితనం బాగుంది. మణిశర్మ సంగీతం బాగుంది. ఆర్ ఆర్ లో మ‌రోసారి మ‌ణి మార్క్ ప్రూవ్ చేశారు. నిర్మాణ విలువ‌లు బాగున్నాయి.

చివ‌రిగా: శ‌మంత‌క‌మ‌ణి పై ఓసారి ఎక్కాల్సిందే ( ఐమీన్ చూడాల్సిందే)

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts