కత్తిలాంటి ఫిగర్ కి కలిసిరాని "కత్తి"

0

samantha-and-vijay-kaththi-new-stillsతెలుగులో నాలుగైదు సినిమాలకే టాప్ హీరోయిన్ స్థాయికి చేరిన చెన్నై బ్యూటీ సెక్సీ సమంత కి మాతృ భాషలో మాత్రం మరో మెట్టు ఎక్కడానికి నానా కష్టాలు పడుతోంది. అక్కడ ఎన్ని సినిమాలు చేసినా అమ్మడు ఆ నంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకోలేకపోతోంది. హీరోల మీద అడపా దడపా నోరు పోసుకుని ఏదో ఒక వివాదాల్లో చిక్కుకోవడం సమంత కి అలవాటె. కానీ ఈ అమ్మడు ఇప్పటిదాకా రాజకీయాల జోలికి పోలేదు,కానీ చిత్రంగా తను తమిళంలో విజయ్ తో చేస్తున్న “కత్తి” సినిమా మాత్రం తన ప్రమేయం లేకుండానే రాజకీయ వివాదాల్లో చిక్కుకుంది.

ఈ సినిమాను విడుదల కాకుండా అడ్డుకోవాలి అంటూ తమిళనాడులోని పురట్చిభారతం పార్టీ వర్గీయులు నిన్న బుధవారం ఆందోళన నిర్వహించారు. చెన్నైలోని నుంగంబాక్కంలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న ఈ పార్టీ మద్దతు దార్లు శ్రీలంక అధ్యక్షుడు రాజపక్సే మద్దతుదారులు ఈ సినిమాను నిర్మిస్తున్నారని ఆరోపిస్తూ ఈ సినిమాను విడుదలను నిలిపివేయకపోతే తాము రాజకీయ ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు. అంతేకాదు తాము హీరో విజయ్‌, చిత్ర దర్శకుడు మురుగదాస్‌ ఇళ్లను ముట్టడిస్తామని కూడ హెచ్చరించారు. ఎల్టీటీఇ ప్రభాకరన్‌ కుమారుడు బాలచంద్రన్‌ను మట్టు పెట్టిన రాజపక్సే మద్దతు దార్లు నిర్మించిన ‘కత్తి’ సినిమా విడుదల అయితే అది తమిళ జాతికి జరిగిన తీవ్ర అన్యాయంగా తాము పరిగణిస్తామని ఈ ఉద్యమ కారులు అభిప్రాయ పడుతున్నారు.

దీపావళికి విడుదల అవుతుంది అని అనుకుంటున్న ఈ ‘కత్తి’ సినిమా పై సమంత చాల ఎక్కువ ఆసలు పెట్టుకుంది. సూర్య సినిమా ‘సికిందర్’ లో అందాలు ఆరబోసినా కలిసి రాకపోవడంతో కనీసం విజయ్ అయినా గట్టెక్కిస్తాడు అని అనుకుంటే ‘కత్తి’ చుట్టూ రాజకీయ దుమారాలు అలుము కోవడంతో సమంతకు కోలీవుడ్ కలిసి రాదేమో అని అనిపిస్తోంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

మెగాస్టార్ 151 `సైరా న‌ర‌సింహారెడ్డి` లో హేమాహేమీలు
మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న 151వ సినిమా `సైరా న‌ర‌సింహా రెడ్డి` చిత్రంలో హేమా హేమీలు భాగ‌మ‌య్యారు. బాలీవుడ్ లెజెండ‌రీ అమితాబ...
మెగాస్టార్ 151వ సినిమా `సైరా న‌ర‌సింహారెడ్డి` మోష‌న్ పోస్ట‌ర్ నా చేతుల మీదుగా లాంచ్ చేయ‌డం అదృష్టంగానూ..గౌర‌వంగాను భావిస్తున్నాను: ద‌ర్శ‌క ధీర‌డు రాజ‌మౌళి
మెగాస్టార్‌ చిరంజీవి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. చిరంజీవి 151వ సినిమా ఫస్ట్‌లుక్‌ విడుదలైంది. మంగళవారం ఆయన పుట్టినరోజు స...
powered by RelatedPosts