ముప్పై దాటినా పెళ్లికేం తొందరంటోంది..

0

Bipasha-Basu_2హీరోయిన్‌లకి ఎంత వయసు వచ్చినా, తమని తామెప్పుడూ స్వీట్ సిక్స్‌టీన్ లలో ఉన్నట్టే ఊహించుకుంటారు కాబోలు. అందుకే, పెరుగుతున్న వయసుని ఏ మాత్రం పట్టించుకోకుండా ఎప్పుడు పెళ్లి ప్రస్తావన తెచ్చినా “అప్పుడే నాకు పెళ్ళా? అంటూ ఆశ్చర్యపోతుంటారు. ఇదే కోవకి ముద్దుగుమ్మ బీపాషా బసు కూడా చేరిపోయింది. ఓ పక్క సినిమాల్లో అవకాశాలు తగ్గాయి, మరో పక్క ఐదేళ్ల క్రితమే ముప్పై ఏళ్లు నిండాయి…అయినా కూడా “నాకా? పెళ్లా..? అప్పుడేనా.. ? అంటూ కాన్వెంటులో చదివే పాపలా కటింగ్ ఇస్తోంది.

బోయ్ ఫ్రెండు హర్మన్ బవేజాతో తనకు నిశ్చితార్థం జరిగిపోయిందంటూ వచ్చిన కథనాలను బిపాసా కొట్టిపారేసింది. ఇప్పుడప్పుడే తన పెళ్లికి వచ్చిన తొందరేమీ లేదని, ప్రస్తుతం తాను నటన మీదే దృష్టి సారించానని చెబుతోంది. పెళ్లిని తాను చాలా గౌరవిస్తానని, కానీ దానికి ఇంకా చాలా టైం ఉందని చెప్పింది. తాను చాలా ప్రశాంతంగా ఆ పని చేస్తానంది.

ఇప్పుడు తాను చేయాల్సిన సినిమాలున్నాయని, కేవలం నటనే కాక ఇంకా చాలా పనులు కూడా చేయాలని, వాటి గురించి ఇప్పుడు మాత్రం చెప్పలేనని బిపాసా అంటోంది. తాజాగా విడుదలైన ‘క్రీచర్ 3డి’ సినిమా విజయాన్ని ప్రస్తుతం ఆమె ఆస్వాదిస్తోంది. ఇంతకుముందు ఆమె నటించిన ‘ఆత్మ’, ‘హమ్ షకల్స్’ చిత్రాలు బాక్సాఫీసు వద్ద బోల్తా కొట్టాయి. ప్రేక్షకులు తనను తల్లిపాత్రలో చూసేందుకు ఇష్టపడలేదని, అందుకే ఆత్మ సినిమా పెద్దగా ఆడలేదని అంటోంది. 35 ఏళ్ల బిపాసా బసు 2001లో ‘అజ్ నబీ’ సినిమాతో తన కెరీర్ ప్రారంభించింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

స‌రిహ‌ద్దు సైనిక‌ల‌తో సూర్య వాలీబాల్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క‌థానాయకుడిగా వ‌క్కంతం వంశీ ద‌ర్శ‌క‌త్వంలో ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో నా పేరు సూర్య చిత్రం తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిస...
అల్లు రామ‌లింగ‌య్య హోమియో కాలేజ్ కు మెగాస్టార్ కోటి రూపాయ‌లు విరాళం
మెగాస్టార్ చిరంజీవి చేసే సేవా కార్య‌క్ర‌మాల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. స‌హాయ‌మంటూ వెళ్లిన వారికి ఆయ‌న స‌హాయం ఎప్పుడూ అందుతూనే ఉంటుంది. తాజాగా ...
`అ` తెచ్చిన అద్భుత అవ‌కాశం
`అ` హిట్ తో రెజీనా కు మంచి గుర్తింపు ద‌క్కింది. అందులో అమ్మ‌డి మేకోవ‌ర్ అంద‌ర్నీ విస్మ‌యానికి గురిచేసింది. స‌క్సెస్ అందుకుంది. అందుకే అ మ‌రో అద్భ...
powered by RelatedPosts