'రోబో'కు సీక్వెల్…!!

0

Robo-Rajiniరజనీకాంత్, ఐశ్వర్య రాయ్ జంటగా వచ్చిన మూవీ ‘రోబో’. 2010లో విడుదలైన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి రికార్డులు సృష్టించిందో మనకు తెలిసిందే. టెక్నాలజీ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచానికి భారతీయ సినిమా సత్తా ఏంటో చాటిచెప్పింది. క్రియేటివ్ డైరెక్టర్ శంకర్ మేకింగ్ మయాజాలం సినిమాను సంచలనాల దిశగా పయనింప చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీరికార్డు కలెక్షన్లు వసూలు చేసింది. ఇక తాజాగా సమాచారం ప్రకారం ఈ మూవీకి సీక్వెల్ రాబోతుందట. ఈ సినిమాకు కూడా శంకర్ దర్శకత్వం వహించనున్నాడని తెలుస్తోంది. ఇక రజనీకి జోడిగా ఐశ్వర్యనే నటించే చాన్స్ ఉందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన స్ర్కిప్టు పనులు జరుగుతున్నట్లు సమాచారం. ‘రోబో’లో నటించిన ప్రధాన తారాగణం అంతా ఈ సీక్వెల్ లో కూడా నటించే చాన్స్ ఉందట. అన్నీ కుదిరితే.. ఈ ఏడాది చివర్లో రోబో సీక్వెల్ స్టార్ట్ కాబోతుందని కోలీవుడ్ టాక్. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు ఓల్ ఇండియాలో హాట్ టాపిక్ గా మారింది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts