శేఖర్ మూవీస్ ఫస్ట్ లుక్ , టీజర్ లాంచ్

0
ఆది పినిశెట్టిని దర్శకుడి గా పరిచయం చేస్తూ శేఖర్ మూవీస్ పతాకంపై ఎస్. చంద్రశేఖర్ నిర్మిస్తున్న చిత్రం ప్రొడక్షన్ నెంబర్ వన్ చిత్ర ఫస్ట్ లుక్ , టీజర్ కార్యక్రమం గురువారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ ప్రివ్యూ థియేటర్ లో జరిగింది. ఈ కార్యక్రమంలో హీరో రవిచంద్రన్ , హీరోయిన్ సుమయ , దర్శక నిర్మాతలు ఆది పినిశెట్టి , చంద్రశేఖర్ లతో పాటు పలువురు నటీనటులు, సాంకేతిక నిపుణులు పాల్గొన్నారు. ఇదే రోజు నిర్మాత చంద్రశేఖర్ పుట్టినరోజు కావడంతో కేక్ కట్ చేయించి యూనిట్ సభ్యులు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ దర్శకులు ఆది పినిశెట్టి చెప్పిన కథ నచ్చడంతో ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే ఒప్పుకున్నానని , అంత బాగా నచ్చిందని …..ఆ వెంటనే సినిమా సెట్స్ మీదకు వెళ్లిందని మిగతా విషయాలన్నీ శతదినోత్సవ వేడుకల్లో మాట్లాడతానని అన్నాడు.
హీరోయిన్ సుమయ మాట్లాడుతూ నాకు కూడా ఈ సినిమా కథ బాగా నచ్చిందని అందుకే సింగిల్ సిట్టింగ్ లోనే ఓకే చేశానని, ఈ సినిమా నాకుఒక మంచి ఎక్స్ పీరియన్స్ అని తెలిపింది.
దర్శకులు ఆది పినిశెట్టి మాట్లాడుతూ కథ చెప్పిన మూడు గంటల్లోనే నాకు డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చారు చంద్రశేఖర్ గారు. నాకు తమిళ దర్శకులు బాల అంటే చాలా ఇష్టం , ఆయన లాంటి విభిన్నమైన సినిమాలు చేయాలనేది నా ఆశ . అందుకే ఈ సినిమా చేసాను. తెలుగులో బిచ్చగాడు సినిమా సంచలన విజయం సాధించింది, అదే స్థాయిలో మా సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. ఇంకా ఈ కార్యక్రమంలో హీరో రవిచంద్రన్ తో పాటు సంగీత దర్శకులు గౌతమ్, సాంబ , మల్లేష్ , నంద కృష్ణ , రమేష్, రాన్ రవి తదితరులు పాల్గొన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts