“సత్య గ్యాంగ్” సాంగ్స్ సూపర్ అంటున్నారు!!

0
సాత్విక్ ఈశ్వర్ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ వన్ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్యాపారవేత్త మహేష్ ఖన్నా నిర్మిస్తున్న చిత్రం ‘ సత్య గ్యాంగ్’. పుష్కలమైన వినోదానికి కాస్తంత సందేశాన్ని జోడించి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆడియో వేడుక కర్నూల్ లో ఘనంగా జరిగింది. ఆదిత్య మ్యూజిక్.. ఈ చిత్రం ఆడియో విడుదల చేసింది. ఆడియోకు వస్తున్న స్పందనను పురస్కరించుకొని చిత్ర యూనిట్ ఆడియో సక్సెస్ మీట్ నిర్వహించింది. ఇందులో హీరో సాత్విక్ ఈశ్వర్, హీరోయిన్ అక్షిత, నిర్మాత మహేష్ ఖన్నా, దర్శకుడు మరియు ఈ చిత్రానికి సంగీతం కూడా సమకూర్చిన ప్రభాస్, సినిమాటోగ్రాఫర్ అడుసుమిల్లి విజయ్ కుమార్ పాల్గొన్నారు.
నిర్మాత మహేష్ ఖన్నా మాట్లాడుతూ.. ‘సమాజంలో అనాధలనేవారు ఉండకూడదనే సందేశానికి వినోదాన్ని మేళవించి తీస్తున్న చిత్రం ‘సత్య గ్యాంగ్’. హీరోగా పరిచయమవుతున్న సాత్విక్ ఈశ్వర్ కి చాలా మంచి భవిష్యత్ ఉంది. ఇటీవల విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. మా డైరెక్టర్ ప్రభాస్ మ్యూజిక్ డైరెక్టర్ గానూ మంచి మార్కులు స్కోర్ చేశాడు. మార్చ్ 15 న సినిమా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం ” అన్నారు.
ప్రభాస్ మాట్లాడుతూ.. “సినిమా బాగా వచ్చిందన్నా.. మ్యూజిక్ కి చాలా మంచి రెస్పాన్స్ వస్తోందన్నా అందుకు కారణం మా ప్రొడ్యూసర్” అన్నారు. ‘సత్య గ్యాంగ్’ వంటి ఓ మంచి సినిమాతో హీరోగా పరిచయమవుతుండడం గర్వంగా ఉందని హీరో సాత్విక్ ఈశ్వర్ అన్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించే అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు అక్షిత కృతజ్ఞతలు చెప్పారు.
ప్రత్యూష్, హర్షిత, సుమన్, సుహాసిని, కాలకేయ ప్రభాకర్, షఫీ, జీవా, వినోద్, మహేష్ ఖన్నా, రాజేందర్, దిల్ రమేష్, బి.హెచ్.ఈ. ఎల్.ప్రసాద్ ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి.. కథ: సిద్ధయోగి క్రియేషన్స్, ఎడిటర్: నందమూరి హరి,  కో-డైరెక్టర్స్; నాగబాబు-కొండలరావు, నిర్మాత-దర్శకత్వపర్యవేక్షణ: మహేష్ ఖన్నా, సంగీతం-దర్శకత్వం: ప్రభాస్!!
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నా నువ్వే` ట్రైల‌ర్ ఆవిష్క‌ర‌ణ‌
ఈస్ట్ కోస్ట్ ప్రొడ‌క్ష‌న్స్ స‌మ‌ర్ప‌ణ‌లో కూల్ బ్రీజ్ సినిమాస్ నిర్మాణంలో నంద‌మూరి క‌ల్యాణ్ రామ్‌, త‌మ‌న్నా జంట‌గా న‌టించిన చిత్రం `నా నువ్వే`...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts