సంతోషం అవార్డ్స్ స్పెష‌ల్

0

`సంతోషం` మూడ‌వ వార్షికోత్స‌వం.. ఆ ఏడాది `సంతోషం` సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డుల వేడుక వెరీ స్పెష‌ల్. 2005లో జ‌రిగిన ఈ వేడుక‌ల్లో దాదాపు టాలీవుడ్ సినీ ప్ర‌ముఖులంతా హాజ‌ర‌య్యారు. ముఖ్యంగా మెగాస్టార్ చిరంజీవి, యువ సామ్రాట్ అక్కినేని నాగార్జున ముఖ్య అతిధులుగా పాల్గొని వేడుక‌కు కొత్త క‌ళ‌ను తీసుకొచ్చారు. మెగాస్టార్ చేతుల మీదుగా యువ సామ్రాట్ ,ఛార్మింగ్ స్టార్ శ్రీకాంత్ చేతుల మీదుగా యువ హీరో నితిన్ సంతోషం అవార్డుల‌ను అందుకున్నారు. ఇదే వేదిక‌పై రాక్ స్టార్ దేవీ శ్రీప్ర‌సాద్ స్టేజ్ పెర్పామెన్స్ తో `సంతోషం` అభిమానుల‌ను, తెలుగు రాష్ర్ట ప్ర‌జ‌ల‌ను అల‌రించి ఆక‌ట్టుకున్నారు. ఆ ఏడాదికిగానూ దేవి శ్రీ, రాకింగ్ స్టార్ మంచు మనోజ్ చేతుల మీదుగా సంతోషం అవార్డును అందుకున్నారు.

ఆ ఏడాదినే `సంతోషం` అధినేత సురేష్ కొండేటి నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. తొలి ప్ర‌య‌త్నంగా త‌మిళ భాష‌లో బ్లాక్ బ‌స్ట‌ర్ అయిన `కాద‌ల్` చిత్రాన్ని తెలుగులో `ప్రేమిస్తే` టైటిల్ తో అనువ‌దించి నూత‌న కెరీర్ కు నాంది ప‌లికారు. తొలి ప్ర‌య‌త్నం `ప్రేమిస్తే` తోనే స‌క్సెస్ ఫుల్ నిర్మాత‌గా ప్రూవ్ చేసుకున్నారు. ఆ సినిమా సురేష్ జీవితంలో ఓ మైల్ స్టోన్ సినిమాగా నిలిచిపోయింది. అందుకే టాలీవుడ్ ఆయ‌న్ను ఇప్ప‌టికీ ప్రేమిస్తే సురేష్ అని పిలుస్తుంది.

కాగా 16వ సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిలిం అవార్డ్స్ వేడుక వ‌చ్చే నెల‌( ఆగ‌స్టు)లో ఘ‌నంగా జ‌ర‌గ‌నున్న సంగ‌తి తెలిసిందే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
ప్ర‌తిభ‌కు ప్రోత్సాహం -వాళ్ల డ్రీమ్ ఫుల్ ఫిల్ చేయ‌డ‌మే AISFM ల‌క్ష్యం: AISFM చైర్మన్ అక్కినేని నాగార్జున
'AISFM గ్రాండ్ ఫిలిం ఫెస్టివల్ 2018 ' లో భాగంగా అన్నపూర్ణ ఇంటర్నేషనల్ ఫిలిం స్కూల్ విద్యార్థులు నిర్మించిన 8 చిత్రాల ప్రదర్శనఅన్నపూర్ణ ఇం...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
powered by RelatedPosts