సంతోషం 6వ వార్షికోత్స‌వం స్పెష‌ల్

0

సంతోషం` ఆర‌వ వార్షికోత్స‌వం..`సంతోషం` సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డుల వేడుక 2007లో అత్యంత వైభవంగా హైద‌రాబాద్ హైటెక్స్ లో ని హెచ్.ఐ.సీ.సీ నోవాటల్ లో జ‌రిగింది. ఈ వేడుక‌ల‌కు ద‌ర్శ‌క‌ర‌త్న దాస‌రి నారాయ‌ణ‌రావు, గాయ‌కులు ఎస్. పీ బాల‌సుబ్ర‌మ‌ణ్యం, న‌ట‌సింహ బాల‌కృష్ణ‌, విక్ట‌రీ వెంక‌టేష్ ముఖ్య అతిధులుగా హ‌జ‌ర‌య్యారు. వెంక‌టేష్ చేతుల మీదుగా బాల‌కృష్ణ‌, బాల‌కృష్ణ చేతుల మీదుగా బ్యూటుఫుల్ హీరోయిన్ ఇలియానా, సాయికుమార్ సంతోషం అవార్డుల‌ను అందుకున్నారు. ఇదే వేదిక‌పై గాయ‌కులు ఎస్పీబీకి అతిధుల స‌మ‌క్షంలో ఘ‌నంగా స‌న్మానం జ‌రిగింది.

ఈ సంద‌ర్భంగా బాల‌కృష్ణ‌, దాస‌రి నారాయ‌ణ‌రావు సంతోషం అధినేత సురేష్ కొండేటి ప‌నిత‌న్నాన్ని కొనియాడారు. సంతోషం సినీ వార ప‌త్రిక‌కు పెద్ద అభిమానిన‌ని, సురేష్ హార్డ్ వ‌ర్క్ , క‌మిట్ మెంట్ వ‌ల్లే ఈస్థాయికి వ‌చ్చారు. నిజాయితీగ‌ల వ్య‌క్తి అని, సంతోషం కు త‌న స‌హ‌కారం ఎప్పుడూ ఉంటుంద‌ని` బాల‌కృష్ణ అన్నారు.

దాస‌రి నారాయ‌ణ‌రావు మాట్లాడుతూ, ` స్టేట్ గ‌వ‌ర్న‌మెంట్- సెంట్ర‌ల్ గ‌వ‌ర్న‌మెంట్ నిర్వ‌హించాల్సిన వేడుక‌ల‌వి. కానీ సురేష్ ఒక్క‌డే వ‌న్ మ్యాన్ ఆర్మీలో హార్డ్ వ‌ర్క్ తో చేయ‌డం గొప్ప విష‌యం. క‌ష్ట శీలి కాబ‌ట్టే ఆయ‌న ఈ రోజు ఉన్నత స్థానంలో కొన‌సాగుతున్నాడు. సంతోషం ఆరు వార్షికోత్స‌వాలు పూర్తిచేసుకోవ‌డం సంతోషంగా ఉంది` అని అన్నారు.

కాగా 16వ సంతోషం సౌత్ ఇండియ‌న్ ఫిలిం అవార్డ్స్ వేడుక వ‌చ్చే నెల‌( ఆగ‌స్టు) 12న హైద‌రాబాద్ లో ఘ‌నంగా నిర్వ‌హించ‌డానికి ముహూర్తం కుదుర్చారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సుమా రంగనాథన్ ప్రధాన పాత్రలో 'దండుపాళ్యం 4'
ఒకప్పుడు బోల్డ్ బ్యూటీగా పేరొందిన సుమా రంగనాథన్ (సుమన్ రంగనాథన్) ఇప్పటికీ తన దరికి చేరిన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉన్నారు. ఆమె నటించిన 'మైనా'...
నమస్తే హైదరాబాద్ టైటిల్ లోగో విడుదల
పి సి క్రియేషన్స్ పతాకం పై మనో ఆర్య, మహి వర్మ ప్రధాన తారాగణం లో మనోహర్ చిమ్మని దర్శకత్వం లో ప్రదీప్ చంద్ర నిర్మాతగా తెలంగాణ నేపధ్యం లో నిర్మి...
కలువ తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ 
తెలుగు అంకెలు , తెలుగు మాసాలు తెలుగు భాషపై అవగాహన పెంపొందించే విధంగా కలువ క్యాలెండర్‌ను రూపొందించారు. ఈ కార్యక్రమంన్యూస్ హెరాల్డ్ సంస్థ సౌజన్యం...
powered by RelatedPosts