టాలీవుడ్ సెల‌బ్రిటీల స‌మ‌క్షంలో అంగ‌రంగ వైభ‌వంగా `సంతోషం` అవార్డుల క‌ర్టైన్ రైజ‌ర్ ఫంక్ష‌న్

0

santosham

santosham

`సంతోషం` వార్షికోత్స‌వాలు..`సంతోషం` సౌత్ ఇండియ‌న్ ఫిల్మ్ అవార్డుల వేడుక ప్ర‌తీ ఏడాది ఘ‌నంగా జ‌రుగుతోన్న సంగ‌తి తెలిసిందే. కాగా 15 సంవ‌త్స‌రాల దిగ్విజ‌యంగా పూర్తిచేసుకుని 16వ ప్రాయంలోకి సంతోషం అడుగుపెట్టేసింది. ఈ నెల 12న (ఆగ‌స్టు) హైద‌రాబాద్ గ‌చ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో అంగ‌రంగ వైభ‌వంగా సంతోషం అవార్డు వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డానికి ముహూర్తం కూడా కుదిర్చారు. దానికి సంబంధించిన క‌ర్టైన్ రైజ‌ర్ ఫంక్ష‌న్ నేడు (బుధ‌వారం) సాయంత్రం హైద‌రాబాద్ ఎఫ్ ఎన్ సీసీ క‌ల్చ‌ర‌ల్ సెంట‌ర్ లో తార‌ల స‌మ‌క్షంలో ఘ‌నంగా జరిగింది.

అవార్డుల‌కు సంబంధించిన లోగోను `మా` అధ్య‌క్షుడు శివాజీ రాజా, హీరోయిన్ రెజీనా లాంచ్ చేశారు. అలాగే `సంతోషం` తొలి ఆహ్వాన పత్రికను శివాజీ రాజా, రెజీనాకు అందించారు. ఈ కార్య‌క్ర‌మంలో నిర్మాత కె.ఎస్ రామారావు, హీరో ఆది, హెబ్బా ప‌టేల్, రెజీనా, ఏడిద రాజా, ఏడిద శ్రీరామ్, మ‌హేష్ కొండేటి, ల‌క్ష్మి కొండేటి త‌దిత‌రులు పాల్గొన్నారు. ఇదే వేదిక‌పై సురేష్ కోండేటి కుమార్తె ల‌క్ష్మి కొండేటి పుట్టిన రోజు వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి.

`మా` అధ్య‌క్షులు శివాజీ రాజా మాట్లాడుతూ, ` ప్ర‌తీ ఏడాది సంతోషం అవార్స్డ్ ఎంత గ్రాండ్ గా జ‌రుగుతున్నాయో తెలిసిందే. సంతోషం అవార్స్డ్ అంటే తెలుగు సినిమా ఇండ‌స్ర్టీ అంతా కదిలి వ‌స్తుందంటే కార‌ణం సురేష్ గారి చిరునవ్వే. దిగ్విజ‌యంగా 15 ఏళ్లు పూర్తిచేసుకుని ఇప్పుడు సంతోషం 16 ఏళ్ల టీనేజ్ వ‌య‌సులోకి అడుగు పెట్టేసింది. ఈ ఏడాది కూడా అవార్డుల వేడుక కూడా అదిరిపోతుంది. సురేష్ గారు పాల‌కొల్లు నుంచి వ‌చ్చిన తొలి రోజు నుంచి ప‌రిచ‌యం ఉంది. ఏ ప‌నినైనా చాలా సింపుల్ గా చేయ‌గ‌ల వ్య‌క్తి. టెన్ష‌న్ అనే మాట ఆయ‌న‌కు తెలియ‌దు. అలాగే `మా` అసోసియేష‌న్ లో పేద కళాకారులంద‌రికీ ఆర్ధికంగా ఎంతో స‌హాయం చేస్తున్నారు. అందుకు ఆయ‌న‌కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నా` అని అన్నారు.

హీరో ఆది మాట్లాడుతూ, ` నా చిన్న‌ప్పుడు మా నాన్న‌గారు సంతోషం అవార్డుతో ఇంటికొచ్చిన‌ప్పుడు ఇలాంటి అవార్డు ఎప్ప‌టికైనా అందుకోవాల‌నే ఓ డ్రీమ్ ఉండేది. ఆ క‌ల ప్రేమ‌కావాలి సినిమాతో తీరింది. 15 ఏళ్లు పూర్తిచేసుకుని 16వ సంవ‌త్స‌రంలోకి సంతోషం అడుగు పెట్ట‌డం చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డుల వేడుక మ‌రిన్ని సంవ‌త్స‌రాలు పాటు కొనసాగాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

హీరోయిన్ రెజీనా మాట్లాడుతూ, ` సురేష్ గారు ఎప్పుడు న‌న్ను క‌లిసినా సంతోషం అవార్డుల గురించే మాట్లాడుతారు. ఆ స‌మ‌యంలోనే ఆయ‌న‌కు అవార్డుల ప‌ట్ల ఉన్న ఫ్యాష‌న్ ఎలాంటిదో అర్ధ‌మైంది. ఇన్నేళ్ల పాటు అవార్డు వేడుక‌ల‌ను నిర్వ‌హించ‌డం అంటే చిన్న విష‌యంకాదు. ఎంతో క‌మిట్ మెంట్..డెడికేష‌న్ ఉండాలి. అవ‌న్నీ సురేష్ గారిలో ఉన్నాయి. 25 ఏళ్ల పాటు అవార్డు వేడుక‌ల‌ను నిర్వ‌హించాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

`సంతోషం` అధినేత‌ సురేష్ కొండేటి మాట్లాడుతూ, ` గ‌త 15 ఏళ్ల నుంచి అంగ‌రంగ వైభ‌వంగా సంతోషం వార్షికోత్స‌వాల‌ను..అవార్డు వేడుక‌ల‌ను జరుపుతున్నా. ప్ర‌తీ ఏడాది నా ప్రొగ్రాం స‌క్సెస్ అవుతుందంటే కార‌ణం తెలుగు సినిమా ఇండ‌స్ర్టీనే. అసలు అవార్డ‌లు కార్య‌క్ర‌మం ప్రారంభించ‌డానికి కార‌ణం హీరో నాగార్జున గారు. సంతోషం మ్యాగ‌జైన్ ఓపెనింగ్ రోజ అవార్డులు కూడా ప్ర‌ధానం చేస్తే బాగుంటుంద‌ని ఆయ‌న స‌ల‌హా ఇవ్వ‌డంతో ఇదంతా చేయ‌గ‌లిగాను. త‌ర్వాత‌ చిరంజీవి గారు, బాల‌కృష్ణ గారు, వెంక‌టేష్ గారు న‌న్ను ఎంత‌గానో ప్రోత్స‌హించారు. అలాగే శివాజీ రాజా, ఏడిద శ్రీరామ్, రాజా లు కూడా నాకు మంచి స‌పోర్ట్ ఇస్తున్నారు. నేను బ్ర‌తికున్నంత కాలం సంతోషం అవార్డు వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వ‌హిస్తాను. తెర ముందు..తెర వెనుక ఉండి ప్రోత్స‌హిస్తున్న వారంద‌రికీ ఎప్ప‌టికీ రుణ‌ప‌డే ఉంటాను. అలాగే ప్ర‌తీ ఏడాది అవార్డు వేడుక‌ల్లో ఏదో స్పెషాలిటీ ఉండే విధంగా ప్లాన్ చేస్తువ‌చ్చాను. ఒక్కో అవార్డు ఫంక్ష‌న్ కు ఒక్కోక్క ప్ర‌త్యేక‌త ఉంది. గ‌త ఏడాది హెబ్బా ప‌టేల్ లైవ్ పెర్పామెన్స్ తో అద‌ర‌గొట్టింది. ఈ ఏడాది వేడుక‌లను కూడా చాలా స్పెష‌ల్ గా ప్లాన్ చేశాం. ఆగ‌స్టు 12 న అత్యంత వైభవంగా వేడుక‌లు నిర్వ‌హిస్తున్నాం` అని అన్నారు.
హీరోయిన్ హెబ్బా ప‌టేల్ మాట్లాడుతూ, ` గ‌త ఏడాది సంతోషం వేడుక‌ల్లో లైవ్ పెర్పామెన్స్ ఇచ్చాను. ఇంత‌టి గొప్ప వేడుక‌ల్లో నేను భాగ‌మ‌వ్వ‌డం సంతోషంగా ఉంది. ఈ ఏడాది వేడుక‌లు చాలా స్పెష‌ల్ గా ఉంటాయి` అని అన్నారు.

సీనియ‌ర్ పాత్రికేయుడు వినాయ‌క‌రావు మాట్లాడుతూ, `సురేష్ విజ‌యంలో నాది స‌గ భాగం ఉంటుంది. 15 ఏళ్ల నుంచి అవార్డు వేడుక‌ల‌ను వ‌న్ మేన్ ఆర్మీలో నిర్వ‌హిస్తున్నారు. ఈ 16వ సంతోషం వేడుక‌లు కూడా ఘ‌నంగా నిర్వ‌హించాల‌ని కోరుకుంటున్నాం` అని అన్నారు.

మ‌రో సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ ప్ర‌భు మాట్లాడుతూ, ` సురేష్ కోండేటి మ‌ల్టీ ట్యాలెంటెడ్ ప‌ర్స‌నాలిటీ. ఆయ‌న ఇండ‌స్ర్టీకి వ‌చ్చిన కొత్త‌లో ఆయ‌న ప‌నిత‌నం చూసి ప్ర‌శంసించిన వారు ఉన్నారు..అసూయ ప‌డ్డ‌వారు ఉన్నారు. అలాగే ప్ర‌శంస‌లు వ‌చ్చిన‌ప్పుడు పొంగిపోలేదు..విమ‌ర్శ‌లు వ‌చ్చిన‌ప్పుడు కృంగిపోలేదు ఆయ‌న‌. క‌ష్టాన్నే న‌మ్ముకుని త‌న ప‌ని తాను చేసుకుంటూ వెళ్లిపోయేవాడు. ఇప్ప‌టికీ అదే ప‌ద్ద‌తిలో కొన‌సాగుతున్నారు. ఒక నిర్మాత‌గా,డిస్ర్టిబ్యూట‌ర్ గా, ఎగ్జిబిట‌ర్ గా అంచెలంచెలుగా పైకి ఎదిగి ఉన్న‌త స్థానంలో ఉండ‌టం సంతోషంగా ఉంది. 15 ఏళ్ల పాటు సంతోషం వార్షికోత్స‌వాల‌ను..అవార్డుల‌ను నిర్వ‌హించ‌డం అంటే చిన్న విష‌యం కాదు. ప్ర‌భుత్వాలే చేయ‌లేని ప‌నిని సురేష్ ఒక్క‌డే చేయ‌డం ఎంతో గొప్ప విష‌యం. సంతోషం ఎప్పుడూ ఇలాగే విజ‌య‌ప‌థంలో దూసుకుపోవాల‌ని కోరుకుంటున్నా` అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
విబి ఎంటర్ టైన్మెంట్స్ వెండితెర అవార్డులు సినీ టివి డైరి లాంచ్
విబి ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు సినిమా టివి, సినీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులు అందిస్తున్న విషయం తెలిసిందే. విబి ...
టెల్ మీ బాస్ పిక్చర్స్ 'కుమార్ రాజా` కొత్త చిత్రం ప్రారంభం
Tellmeboss Pictures పతాకంపై నిర్మాత శ్రీచక్ర మల్లికార్జున తన స్వీయ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న తొలిచిత్రం ‘కుమార్ రాజా’ చిత్ర...
powered by RelatedPosts