`శ‌మంత‌క‌మ‌ణి`ని జీవితంలో మ‌ర్చిపోలేను: స‌ందీప్ కిష‌న్!

0
నారా రోహిత్ , సుధీర్ బాబు, సందీప్ కిషన్, ఆది,  రాజేంద్ర ప్రసాద్, కాంబినేషన్ లో తెర‌కెక్కుతోన్న చిత్రం  ‘శమంతక మణిస‌.  `భలే మంచి రోజు’ ఫేమ్ శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వ‌హించారు. భవ్య క్రియేషన్స్ పతాకం పై వి.  ఆనంద్ ప్రసాద్  నిర్మించిన ఈ సినిమా శుక్ర‌వారం ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తోంది. ఈ సంద‌ర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ….
**ఇందులో నా పాత్ర పేరు కోటిపల్లి శివ. థియేటర్ ర‌న్ చేసే కుర్రాడిని. అతనికో పెయిల్యూర్  స్టోరీ. అందులోనే ఊర మాస్ ను ఎలివేట్ చేసే సీన్స్. తెర‌పై క‌నిపించినంత సేపు ఫ‌న్నీగా ఉంటుంది. నాకు ఇద్దరు హీరోయిన్లు. ఒకరు అనన్య. ఆమె మిస్ ఆస్ట్రేలియా. ఇంకొకరు జెన్నీ. ఈమె తెలుగమ్మాయి.
 **సినిమా చాలా కొత్తగా ఉంటుంది. శ్రీరామ్ ఆదిత్య ముందుగా మంచి స్క్రిప్ట్ ను తయారుచేసుకోవడం వలన సినిమా చాలా బాగా వచ్చింది. ప్రతి క్యారెక్టర్ ప్రేక్షకుడికి కనెక్టయ్యే విధంగా ఉంటుంది. నా కెరీర్లో మర్చిపోలేని సినిమా అవుతుంది.
** ఇప్పుడు మూడు సినిమాలు నడుస్తున్నాయి. ఒకటి కునాల్ కోహ్లీ సినిమా, ఇంకొకటి కార్తిక్ నరేన్ ‘నరకాసురుడు’, ఇంకొకటి మంజులగారి సినిమా. కృష్ణ వంశీగారితో చేస్తున్న ‘నక్షత్రం’ పూర్తైపోయింది.
** నిజంగా ఆయనతో జర్నీ నా జీవితంలో మర్చిపోలేని అనుభవం. ఆయన్నుండి చాలా నేర్చుకున్నాను. ఆయన పరిచయం వలన నాలో చాలా మార్పులొచ్చాయి. ఇంతకూ ముందు కొంచెం కోపం, విసుగు, లోపల కొంచెం ఈర్ష్య లాంటివి ఉండేవి. కానీ ఇప్పుడవన్నీ పూర్తిగా పోయాయి. లైఫ్ చాలా హ్యాపీగా అనిపిస్తోంది.
** తమిళంలో రీసెంట్ గా చేసిన ‘మానగరం’ అక్కడ నాకు మంచి పేరు తెచ్చింది. నా కెరీర్ డౌన్లో ఉన్నప్పుడు ఆ సినిమా బాగా హెల్ప్ అయింది. ఇప్పుడు కార్తిక్ నరేన్ తో చేస్తున్న ‘నరకాసురుడు’ కూడా మంచి సినిమా. గౌతమ్ మీనన్ గారు ప్రొడ్యూసర్. దాదాపు 11 ఏళ్ల తర్వాత గౌతమ్ మీనన్ నాకు మెసేజ్ చేసి నువ్వు గొప్ప పొజిషన్లో ఉన్నందుకు, మంచి సినిమాలు చేస్తున్నందుకు నాకు చాలా గర్వంగా ఉంది అన్నారు.
Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

త‌ల్లిదండ్రుల గొప్ప‌త‌నాన్ని తెల‌యజేసే `స‌త్య గ్యాంగ్‌` - సుమ‌న్‌
సాత్విక్‌ ఈశ్వర్‌ ని హీరోగా పరిచయం చేస్తూ.. సిద్ధయోగి క్రియేషన్స్‌ పతాకంపై ప్రొడక్షన్‌ నెంబర్‌ వన్‌ గా కర్నూలుకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకులు-వ్య...
యదార్థ సంఘటనలతో 'మర్లపులి..23న రిలీజ్
సుధాకర్ ఇంపెక్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ బోన్ క్రాఫ్ట్ క్రియేషన్స్ పతాకంపై డి నరసింహ సమర్పించిన చిత్రం 'మర్లపులి'. వరుణ్ సందేశ్ ప్రత్యేకపాత్రలో,...
ప్రభుదేవా `లక్ష్మి` టీజర్ విడుదల
ప్రభుదేవా, ఐశ్వర్య రాజేష్‌ తారాగణంగా ప్రమోద్‌ ఫిలింస్‌, ట్రైడెంట్‌ ఆర్ట్స్‌ బ్యానర్స్‌పై విజయ్‌ దర్శకత్వంలో ప్రతీక్‌ చక్రవర్తి, శృతి నల్లప్ప,...
powered by RelatedPosts