శ్రీదేవి-ఇలియాన ల మీద సమంత కామెంట్స్

0

ఉన్నట్టుండి చెన్నై సుందరి సమంత కి ఈ జ్ఞానొదయం ఎందుకు అయిందో తెలియదు కానీ, మొత్తం మీద సందు దొరికితే చాలు ఎడాపెడా ఎవరి మీద పడితే వారి మీద నోటీకొచ్చినట్టు కామెంట్స్ చేస్తోంది. తాజాగా, అలనాటి అందాల తార శ్రీదేవి, గోవా బ్యూటీ ఇలియానా గురించి కూడా సమంత తాజాగా సంచలన కామెంట్స్ చేసింది.”తెలుగు సినిమాలలో ఎంత పెద్ద హీరోయిన్ కు అయినా నటించడానికి పెద్ద ఆస్కారం ఉండదని విపరీతంగా గ్లామర్ ఒలక పోస్తే చాలు నిర్మాతలు భారీ మొత్తాలను పారితోషికాలుగా ఇస్తారని అందువల్ల నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు తెలుగులో దొరకడం కష్టం ” అంటూ కామెంట్లు చేసింది సమంత. అంతేకాదు గతంలో తెలుగు తెరను ఏలిన శ్రీదేవికి కూడ నటించడానికి అవకాశం ఉన్న పాత్రలు కేవలం బాలీవుడ్, కోలీవుడ్ సినిమాలలోనే దొరికాయని టాలీవుడ్ లో శ్రీదేవి నటించినంతకాలం ఆమెను ఒక గ్లామర్ డాల్ గానే చూసారని వ్యాఖ్యలు చేసింది సమంత. అంతేకాదు ఇలియానాను కూడా గ్లామర్ పాత్రలకే పరిమితం చేయడంతో విసుకు చెందిన ఇలియానా టాలీవుడ్ కు దూరమై బాలీవుడ్ లోకి అడుగు పెట్టింది. ఆ తరువాత మాత్రమే ఇలియానాకు నటించడానికి అవకాసం ఉన్న ‘బర్ఫీ’ లాంటి సినిమా దొరకడంతో , తన సత్తాను ఇలియానా బాలీవుడ్ లో చాటుకుంది “అంటూ శ్రీదేవి ఇలియానాలు టాలీవుడ్ వదిలిన తరువాత ఏ విధంగా పేరులోకి వచ్చింది వివరిస్తూ చెన్నైలో మీడియా ముందు కామెంట్లు విసిరింది సమంత.

ఈ మాయలేడి తెలుగు సినిమాల పై విసురుతున్న కామెంట్లు చూస్తూ ఉంటే త్వరలోనే సమంత టాలీవుడ్ కు బైబై చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి అని అనుకోవాలి. కడుపు నిండాక కామెంట్లు కాక మరేం చేస్తారులే అని, ఈ అమ్మడి మీద సెటైర్లు వేసేవాల్ళూ లేకపోలేదు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

Santosham Weekly Magazine 27th November 2017
[caption id="attachment_550501" align="aligncenter" width="702"] Santosham Weekly Magazine 27th November 2017[/caption][caption id="attachmen...
powered by RelatedPosts