సినిమాలకి టాటా చెప్పనున్న సమంత?

0

download (4)ఏంటి…షాక్ అయ్యారా? తప్పులేదులెండి…. ఎందుకంటే, ఈ పిడుగుళాంటి వార్త విని అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఎందరో దర్శక నిర్మాతలు- హీరోలు ఖంగుతింటున్నారు . ఎందుకంటే, ఇప్పుడిప్పుడే పరిశ్రమలోకి వస్తున్న కుర్ర హీరోల దగ్గరి నుండి మొదలుపెడితే, స్టార్ హీరోలైన పవన్ కల్యాణ్ – మహేష్ బాబు లాంటి హీరోలందరూ తమ పక్కన సమంత ఉంటే బాగుంటుంది అనుకునే సమయంలో, చేతి నిండా ఎప్పుడూ కనీసం ఒక ఐదు- ఆరు సినిమాలతో ఊపిరి తీసుకోలేనంత బిజీగా ఉంటున్న క్రమంలో ఈ వార్త నిజంగానే అందరికీ షాక్ ఇవ్వక తప్పదు మరి. ఇంతాకీ సమంత అసలు ఏమనుకుంటోంది? ఆమె అంతరంగం ఏమిటి ఒకసారి అర్ధం చేసుకునే ప్రయత్నం చేద్దాం.

గతనెల విడుదలైన రెండు భారీ సినిమాలలో సమంత తన శక్తిమేరకు గ్లామర్ ఆరబోసినా ఆ సినిమాల పట్ల ప్రేక్షకులు పెదవి విరిచారు. దీనితో సమంత క్రేజ్ తగ్గిందా అంటూ వార్తలు ఊపు అందుకున్నాయి. మీడియాలో వస్తున్న ఈ కామెంట్లు ఈ క్యూట్ హీరోయిన్ దృష్టిలో పడ్డాయి అనుకోవాలి. అందుకే సమంత వెరైటీగా స్పందించింది. ఈ మధ్య మీడియాతో మాట్లాడిన ఈ మాయలేడి తనకు మార్కెట్ పోయిన తరువాత నటనకు స్వస్తి చెప్పడం తనకు ఇష్టం లేదని తాను గోల్డెన్ లెగ్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమయంలోనే తాను సినిమాల నుంచి రిటైర్ అవుతానని చెప్పడం బట్టి అనుకోకుండా వచ్చిన రెండు పరాజయాలు సమంతను చాల భయపెడుతున్నాయనే అనుకోవాలి.

అదేవిధంగా ప్రేమ వ్యవహారాలలో చిక్కుకుని కొందరు హీరోయిన్స్ ఆత్మహత్యలు చేసుకోవడం మరి కొంతమంది అనుకోని సంఘటనలలో చిక్కుకుని బలి పసువులుగా మారడం చూస్తూ ఉంటే నేటి తరం హీరోయిన్స్ కు ఆత్మస్థైర్యం తగ్గి పోతోందా అని తనకనిపిస్తోందని అంటూ సమస్యలకు భయపడే అమ్మాయిలు సినిమా రంగానికి రావద్దు అంటూ సమంత ఇచ్చిన పిలుపు వెనుక అనేక అర్ధాలు దాగి ఉన్నాయి అంటూ విమర్శకులు విశ్లేషణలు చేస్తున్నారు. సమంతకు అనుకోకుండ వచ్చిన ఈ వైరాగ్యంతో నిజంగా సినిమాల నుంచి తప్పుకుంటే మన టాప్ హీరోల పరిస్థితి అయోమయమే.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాహో కోసం మ‌రో బాలీవుడ్ స్టార్
ప్ర‌భాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తోన్న `సాహో` కోసం చిత్ర ద‌ర్శ‌కుడు సుజీత్ ఏకంగా బాలీవుడ్ తారాతోర‌ణాన్ని రంగంలో కి దించేస్తున్నాడు. ఇప్ప‌టికే హీరో...
స్పైడ‌ర్ ఈవెంట్ కు రోబో కాబింనేష‌న్!
మ‌హేష్ క‌థానాయకుడిగా ఏ.ఆర్‌.మురుగ‌దాస్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `స్పైడ‌ర్‌` తెలుగు, త‌మిళంలో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా రిలీజ‌వుతున్న సంగతి తెలిసిందే...
పైసా వ‌సూల్ సాంగ్ టీజ‌ర్
`కన్ను కన్ను కలిశాయి.. ఎన్నో ఎన్నో తెలిశాయి` అంటూ సాగే వీడియో సాంగ్ ను విడుదల చేసింది పైసా వసూల్ చిత్రబృందం. నందమూరి బాలకృష్ణ, శ్రియ మధ్య సాగుత...
powered by RelatedPosts