వేలంటైన్స్ డే సందర్భంగా “సాక్ష్యం” ఫస్ట్ లుక్

0

Bellamkonda Sai Sreenivas Sakshyam Movie First Look ULTRA HD Posters WallPapers

Bellamkonda Sai Sreenivas Sakshyam Movie First Look ULTRA HD Posters WallPapers

టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీవాస్ – యంగ్ అండ్ మోస్ట్ హ్యాపెనింగ్ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా “సాక్ష్యం” అనే డిఫరెంట్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను తెరకెక్కిస్తున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన సెన్సేషనల్ బ్యూటీ పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని అభిషేక్ పిక్చర్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత అభిషేక్ నామా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైద్రాబాద్ లోని రామోజీ ఫీలిం సిటీలో క్లైమాక్స్ షూటింగ్ జరుపుకొంటున్న చిత్రబృందం ఫిబ్రవరి 14న ప్రేమికుల దినోత్సవాన్ని పురస్కరించుకొని సినిమాలో హీరోహీరోయిన్ లుక్స్ ను విడుదల చేశారు.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత అభిషేక్ నామా మాట్లాడుతూ.. “ప్రేమికుల దినోత్సవం సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్-పూజా హెగ్డేల ఫస్ట్ లుక్ ను విడుదల చేశాం. వారి పాత్రలు చాలా వైవిధ్యంగా ఉంటాయి. శ్రీవాస్ హీరోహీరోయిన్ల క్యారెక్టరైజేషన్స్ రాసిన విధానం బాగుంది. ఈ చిత్రంతో ఒక కొత్త శ్రీనివాస్ ను చూస్తారు. ఆయన దర్శకత్వ శైలి పూర్తిగా మారిపోయింది. ‘సాక్ష్యం” చిత్రాన్ని ఆయన తెరకెక్కించిన తీరు ప్రేక్షకుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది. సినిమాలో ఫైట్ సీక్వెన్స్ లు చాలా కీలకం అందుకే పీటర్ హెయిన్స్ మాస్టర్ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుత షెడ్యూల్ లో చిత్ర కథానాయకుడు బెల్లంకొండ, పూజా హెగ్డేల నడుమ కాంబినేషన్ సీన్స్ తోపాటు.. కీలకపాత్రధారులైన జయప్రకాష్, పవిత్ర లోకేష్, వెన్నెల కిషోర్ ల కాంబినేషన్ లో కొన్ని కీలక సన్నివేశాలను కూడా చిత్రీకరించనున్నాం” అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

సాయి శ్రీనివాస్ తో మ‌రో శ్రీనివాస్
యువ కథానాయకుడు బెల్లంకొండ సాయిశ్రీనివాస్ కథానాయకుడిగా మరో సినిమా సైన్ చేశారు. పలు సూపర్ హిట్ చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసిన శ్రీని...
`సంత‌`తొలి షెడ్యూల్ పూర్తి
సూర్య భరత్ చంద్ర ,శ్రావ్యా రావు జంటగా శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జై వర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తొన్న చిత్రం "సంత". మట్టి మనుషుల ప్రేమక...
ఛ‌లో డైరెక్ట‌ర్ తో న‌యా బ్యాన‌ర్!
నాగశౌర్య .. రష్మిక మండ‌న‌ జంటగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెర‌కెక్కిన ‘ఛలో’ ఇటీవ‌ల విడ‌దులైన స‌క్సెస్ అయిన సంగ‌తి తెలిసిందే. ఈ మూవీ అన్ని వ‌ర్గాల...
powered by RelatedPosts