అప్పుడు కొంచెం టెన్ష‌న్ ప‌డ్డా: హీరోయిన్ సాయి ప‌ల్ల‌వి

0

Sai pallavi

వ‌రుణ్ తేజ్, సాయి ప‌ల్ల‌వి జంట‌గా న‌టించిన `ఫిదా` సినిమా ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి విజ‌య‌వంతంగా ప్ర‌ద‌ర్శింప‌బ‌డుతోన్న సంగ‌తి తెలిసిందే. ఈసంద‌ర్భంగా బుధ‌వారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, `

**మ‌ల‌యాళ సినిమా కోసం కూడా వ‌ర్క్ షాప్ చేయ‌లేదు. కానీ ఈ సినిమాకు చేయాల్సి వ‌చ్చింది. అలాగే ఇందులో నా డైలాగులు ఇంపార్డెంట్‌. అందుకే హెల్దీ డిస్క‌షన్స్ చేసుకునేవాళ్లం. ఇందులో తెలంగాణ యాస మా ద‌ర్శ‌కుడు, డైర‌క్ష‌న్ డిపార్ట్ మెంట్ వాళ్లంతా క‌లిసి నేర్పించారు. ఈజీగా నేర్చుకోగ‌లిగాను. ట్రాక్ట‌ర్ తోల‌డం నేర్చుకున్నా. చాలా క‌ష్టం ఆ ప‌ని చేయ‌డం.. ఎలా చేస్తారో పాపం.. అలాగే నాట్లు నాట‌డం కూడా బాగా నేర్చుకున్నా. ఎన్ని పాట‌లు కావాలో శేఖ‌ర్‌గారు అన్నీ పెట్టేశారండీ. బ‌తుక‌మ్మ‌కి సంబంధించి మ‌రో డ్యాన్స్ కూడా ఉంటుంది . దాన్ని త్వ‌ర‌లోనే యాడ్ చేస్తారు.

**చ‌దువు పూర్త‌యింది. జార్జియాలో చేశాను. ఇక్క‌డుంటే సినిమాల కోసం వెళ్తాన‌ని న‌న్ను జార్జియా పంపించి చ‌దివించారు. కార్డియాల‌జీ చ‌ద‌వాల‌ని ఉంది. సినిమాలు చాలు అనుకున్న‌ప్పుడు నేను డాక్ట‌ర్‌గా ప్రాక్టీస్ చేస్తాను.

** వ‌రుణ్ కోసం పే..ద్ద హీల్స్ వేసుకున్నా. నేను 5.4, ఆయ‌నేమో 6.4 అయినా మా జంట బానే ఉంద‌ని చాలా మంది చెప్పారు. వ‌రుణ్ చాలా ప్రొఫెష‌న‌ల్‌గా ఉంటారు. చాలా కామ్‌గా ఉంటారు. ఏ స‌న్నివేశానికి ఎంత కావాలో అంత న‌టించ‌డం అత‌నికి చాలా బాగా తెలుసు.

** ఈ సినిమాలో ప‌వ‌న్ క‌ల్యాణ్ ఫ్యాన్‌ని. ఆయ‌నలా చేయ‌గానే అంద‌రూ క్లాప్స్ కొట్టారు. నా న‌ట‌న న‌చ్చి కొడుతున్నారా? లేక వాళ్ల‌కు న‌చ్చిన ప‌వ‌న్ క‌ల్యాణ్ అనే పేరు విన‌గానే చ‌ప్ప‌ట్లు కొట్టారా అని నాకు అర్థం కాలేదు. సో కాసింత టెన్ష‌న్ ప‌డ్డాను.

**గ‌ట్టిగా అనుకుంటే అవుతుంద‌నే న‌మ్మ‌కం నాలో ఎప్పుడూ ఉంటుంది. కాక‌పోతే ఎవ‌రికైనా కాసింత ఓపిక కావాలి. అంతే అని అన్నారు.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`నేల టిక్కెట్` దెబ్బ‌కు బాల్క‌నీ ఆడియ‌న్స్ విజిల్స్ వేస్తారు: హీరో ర‌వితేజ‌
మాస్ మహారాజ రవితేజ కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రామ్ తళ్లూరి నిర్మించిన ‘నేల టిక్కెట్టు’. ఈ నెల 25న ఈ సినిమా విడుద‌లువ‌తోంది. ఈ సందర్బంగా మంగళ‌వారం ...
`నేల‌టిక్కెట్` లో అన్నీ ఎమోష‌న్స్ ఉన్నాయి..అంద‌రికీ న‌చ్చే సినిమా!
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోగా ఎస్‌.ఆర్‌.టి.ఎంట‌ర్‌టైన్మెంట్స్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన చిత్రం `నేల టిక్కెట్టు`. మే 2...
చదలవాడ బ్రదర్స్ 9వ చిత్రం ప్రారంభం.
చదలవాడ బ్రదర్స్ సమర్పణలొ శ్రీ తిరుమల‌ తిరుపతి వెంకటేశ్వర ఫిలింస్ పతాకం పై చదలవాడ పద్మావతి నిర్మిస్తోన్న  9 చిత్రం‌ ఫిలింనగర్ సాయి బ...
powered by RelatedPosts