చరణ్ హిట్ సాంగ్ టైటిల్ అయింది

0

mfs_Sachin,-Nazia-Hussain_nహిందీలో విజయవంతమైన ‘ఆషికి 2’ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులోకి తీసుకురాబోతున్న సంగతి తెలిసిందే. మ్యూజికల్ గా సంచలనం సృష్టించిన ఈ హిందీ చిత్రంలో ఆదిత్యా కపూర్,శ్రద్దా కపూర్ లీడ్ పెయిర్ గా చేసారు. తెలుగు వెర్షన్ కు గానూ సచిన్‌ జోషి(నిను చూడక నేనుండలేను,ఒరేయ్ పండు,మిత్రుడు) హీరో గా ఎంపిక చేసి షూటింగ్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని జయ రవీంద్ర అనే దర్శకుడు డైరక్ట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి నీ జతగా నేనుండాలి అనే టైటిల్ ని ఖరారు చేసారు. ఇక ఈ టైటిల్ రామ్ చరణ్ హిట్ చిత్రం ఎవడు లో సూపర్ హిట్ సాంగ్ లోంచి తీసుకున్నారు. ఇక దర్శకుడు జయ రవింద్ర గతంలో బంపర్ ఆఫర్(సాయిరామ్ శంకర్)తో చేసి హిట్ కొట్టారు. అలాగే అదే సాయిరామ్ శంకర్ తో చేసిన దిల్లున్నోడు చిత్రం రీసెంట్ గా విడుదలై డిజాస్టర్ అయ్యింది. వికింగ్‌ మీడియా, బండ్ల గణేష్‌ సంయుక్తంగా ఈ తెలుగు రీమేక్ ని నిర్మిస్తున్నారు. అయితే హీరోనే మొత్తం డబ్బులు పెడుతున్నారని అంతటా వినిపిస్తోంది. బండ్ల గణేష్ కేవలం పేపరు పైన మాత్రమే నిర్మాత గా మాత్రమే…ఓ క్యాషియర్ గా వ్యవరిస్తున్నాడని అంటున్నారు. చిత్రం కథేమిటంటే…- రాహుల్ జయకర్ (ఆదిత్య రాయ్ కపూర్) పాప్ సింగర్. అతనికి అశేష అభిమానులు. అతడు ఆడింది ఆట పాడింది పాట. కానీ ఒక్కటే లోపం. తాగుడుకు బానిస. గోవా టూర్‌లో ఉండగా- అర్ధరాత్రి ‘బార్’లన్నీ మూసేయటంతో.. ఊరి చివరి బార్ అండ్ రెస్టారెంట్‌కి వెళతాడు. అక్కడ తన పాటని అంతకంటె మృదు మధురంగా ఆలపించిన ఆరోహి షిక్రె (శ్రద్ధా కపూర్) టాలెంట్‌కి ముగ్ధుడవుతాడు. తనతోపాటు ముంబై వస్తే సింగర్‌ని చేస్తానంటాడు. అతని మాటలు నమ్మి ముంబై చేరుకుంటుంది ఆరోహి. అనుకోని పరిస్థితుల్లో రాహుల్ ఆస్పత్రి పాలవుతాడు. ఆరోహి చేసే ఫోన్లన్నీ రాహుల్ ఫ్రెండ్ రిసీవ్ చేసుకొని -రాహుల్ లండన్ వెళ్లాడని చెప్తాడు. దీంతో రాహుల్‌ని అపార్థం చేసుకుంటుంది ఆరోహి. రెండు నెలల తర్వాత రాహుల్ అసలు విషయం తెలుసుకొని ఆరోహి ఉన్న చోటికి వస్తాడు. అతడికి తెలిసిన మ్యూజిక్ కంపెనీలో ఆమెకి అవకాశం ఇప్పిస్తాడు. ఆమెలోని టాలెంట్ లోకానికి తెలుస్తుంది.

Share.

Leave a Reply

Be the First to Comment!

Notify of
avatar
wpDiscuz
Social Media Auto Publish Powered By : XYZScripts.com

x

Posts for You!

`ప్రేమెంత ప‌ని చేసే నారాయ‌ణ‌` పాట‌ల‌ను ప్ర‌శంసించిన సినీ -రాజ‌కీయ ప్రముఖులు!!
జె.ఎస్‌. ఆర్‌. మూవీస్ ప‌తాకంపై శ్రీమ‌తి భాగ్య‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణలో హ‌రికృష్ణ జొన్న‌ల‌గ‌డ్డ , అక్షిత హీరో హీరోయిన్లుగా జొన్న‌ల‌గ‌డ్డ‌శ్రీనివాస...
శ్రవణ్ హీరో గా నూతన చిత్రం ప్రారంభం
శ్రీ భాగ్యలక్ష్మీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో శ్రవణ్, లియోనా ఈశాయ్ హీరోహీరోయిన్లుగా బాలమురుగన్ దర్శకత్వంలో బోగారి లక్ష్మీనారాయణ నిర్మిస్తున్న...
తెలంగాణా ఉద్యమ నేపథ్యంలో వస్తోన్న ‘ఉద్యమ సింహం’ షూటింగ్‌ ప్రారంభం!!
 ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం కోసం కేసీఆర్‌ చేసిన ఉద్యమ నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘ఉద్యమ సింహం’. పద్మనాయక ప్రొడక్షన్స్‌ పతాకంపై కే...
powered by RelatedPosts